పవన్ ఫ్యాన్స్ తో ఆట… పీ.హెచ్.డీ. చేసాడేమో..!

Ram Gopal Varma Compares Pawan Kalyan With Vijay Devarakonda Arjun Reddyపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఇరిటేట్ చేయడంలో, బహుశా ‘పీ.హెచ్.డీ’ పొందిన వ్యక్తిగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చరిత్రలో నిలిచిపోతారేమో అన్న చందంగా పరిస్థితి మారుతోంది. ఒకప్పుడు ట్విట్టర్ వేదికగా పవన్ ఫ్యాన్స్ తో ఆడుకున్న వర్మ, ప్రస్తుతం ట్విట్టర్ లో లేకపోవడంతో… ఆ వార్ కాస్త ‘ఫేస్ బుక్’కు షిఫ్ట్ చేసాడు. ట్విట్టర్ వదిలేసిన తర్వాత చాలాకాలం పాటు సైలెంట్ గా వర్మ, తాజాగా బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తోన్న “అర్జున్ రెడ్డి” సినిమాతో మళ్ళీ పుంజుకున్నాడు.

ఈ సినిమా వివాదంలో వీహెచ్ ను ఆడుకున్న వర్మ, తాజాగా ఈ సినిమాను విశ్లేషిస్తూ ఫేస్ బుక్ లో ఓ భారీ పోస్టింగ్ నే పెట్టాడు. ‘పవన్ కళ్యాణ్ కంటే విజయ్ దేవరకొండ 10 రెట్లు ఉత్తమం’ అనే టైటిల్ ను పెట్టి “అర్జున్ రెడ్డి” సినిమా మొత్తం విశ్లేషించిన వర్మ, చివర్లో విజయ్ అభినయం గురించి మాట్లాడుతూ… లుక్స్ మరియు చరిష్మా విషయంలో పవన్ కళ్యాణ్ కంటే 10 రెట్లు బెటర్ గా ఉన్నాడని అన్న వర్మ, అభినయం విషయంలో పవన్ కంటే 20 రెట్లు బాగా ప్రదర్శించాడని, తన అభిప్రాయంలో ‘రియల్ పవర్ స్టార్’ అంటే విజయ్ అని కొనియాడారు.

ADVERTISEMENT

నిజానికి సినిమాను విశ్లేషిస్తూ ఓ భారీ సందేశాన్ని పెట్టిన వర్మ, చివర్లో ఓ రెండు ముక్కలు మాత్రం విజయ్ – పవన్ లను ఉదహరిస్తూ పోస్ట్ చేసారు. అయితే మొదట చెప్పినదంతా ఎవరు పట్టించుకున్నా, లేకున్నా చివర్లో చెప్పిన ఈ రెండు ముక్కలు హైలైట్ కావడం, దీనిపై పవన్ అభిమానులు విరుచుకుపడడం జరిగిపోయాయి. ఓ పక్కన మహేష్ కత్తి, మరో పక్కన వర్మ… ఇలా వరుసగా పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories