వర్మ ఒక విషయాన్ని పట్టుకున్నాడంటే… దాన్ని చీల్చిచెండాడే వరకు వదిలిపెట్టరన్న విషయం తెలిసిందే. ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ వేదికగా చెలరేగిన వివాదంపై స్పందిస్తూ… నాగబాబుపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయిన తర్వాత తాజాగా ‘రౌడీ నెంబర్ 150’ పోస్టర్ తో సెటైరికల్ గా వచ్చేసాడు వర్మ. ఓ గ్లాస్ ను తన కన్నుకు అడ్డంగా పెట్టుకుని ‘రౌడీ నెంబర్ 150’ పోస్టర్ ను విడుదల చేసి కౌంటర్ ఇచ్చారు వర్మ.
ఈ పోస్టర్ కు నెటిజన్ల నుండి మంచి స్పందన లభిస్తోంది. ‘పడుకున్న సింహాన్ని లేపి తన్నించుకోవడం’ అంటే ఇదేనని, అలాగే గతంలో ‘జబర్దస్త్’ కార్యక్రమంలో వర్మను పొగిడిన నాగబాబు వీడియోలను పోస్ట్ చేస్తూ ఈ సంచలన దర్శకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే… ఈ ఎపిసోడ్ లో ప్రేక్షకులు ఎక్కువగా వర్మ అభిప్రాయాలకే మొగ్గుచూపడం గమనించదగ్గ విషయం.
ADVERTISEMENT
ADVERTISEMENT



