కోన వెంకట్ రాసే ‘కంఫ్యూజింగ్’ కామెడీ చాలా సినిమాలకు వర్కౌట్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించి పెట్టాయి. అయితే అలాంటి కోన వెంకట్ ను హీరో రామ్ ‘మీరు మరీ చేస్తున్నారు’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసాడు. టాలీవుడ్ టాప్ రచయితగా ఉన్న కోన వెంకట్ ను అంత మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది… అంటే దానికి ఓ కారణం ఉంది మరి! ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ సరదా సంభాషణపై మీరూ ఓ లుక్కేయండి!
తనకు ఓ బుల్లి సోదరుడు ఉన్నాడంటూ ఫుల్ షేవింగ్ చేసుకుని ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, తనంటే ప్రేమ అని చెప్పగా, ‘అతను చాలా స్మార్ట్… అతన్ని చూసుకుంటున్నారు బ్రో… నేను ఒక్కసారి కలవోచ్చా..?’ అంటూ ప్రశ్నించగా, ఫక్కున నవ్విన రామ్, “నేనేదో టైం పాస్ కి కుళ్ళు జోక్ వేసాను, మీరు మరీనూ… మళ్ళీ కలుస్తాను బ్రో…” అంటూ రామ్ రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి మధ్య సాగిన ఈ సరదా ట్వీట్లు నెటిజన్లకు ‘ఎంటర్టైన్మెంట్’గా మారాయి. ఇంతకీ కోన వెంకట్ నిజంగానే ‘మరీ ఎక్కువ’ చేసారా?


