‘అరవింద సమేత’లో గుండెలు పిండేసే పాట!

ramajogaiah-sastry-about-a-song-in-aravindha-samethaఆడియో వేడుక లేదంటూ నిరుత్సాహపరిచిన ‘అరవింద సమేత’ చిత్ర నిర్మాణ సంస్థ, అభిమానులకు నేడు ఓ సర్ ప్రైజ్ ఇస్తామంటూ హామీ ఇచ్చింది. బహుశా రెండవ పాటను రిలీజ్ చేస్తారేమోనన్న ఆలోచనలతో, యంగ్ టైగర్ అభిమానులు చిత్ర నిర్మాణ సంస్థను, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి గారిని సోషల్ మీడియా వేదికగా తెగ ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT

[m9ad]

ఓ అభిమాని వేసిన ప్రశ్నపై స్పందించిన రామ్ జో… “వీడియో రెడీ అవుతోంది, టీం అదే పని మీద ఉంది, మీలో ఉన్న ఉత్సాహం దాచుకోండి, ఎప్పుడొచ్చినా ఈ పాట గుండెలు పిండేస్తుంది” అంటూ ఫ్యాన్స్ కు కావాల్సిన సందేశాన్నిచ్చారు. అయితే ఆ పాట నేడు రిలీజ్ అవుతుందా? లేదా అన్న విషయం స్పష్టత ఇవ్వలేదు. ఫుల్ ఆల్బమ్ అయితే మరో రెండు రోజుల్లో యూ ట్యూబ్ లో ప్రత్యక్షం కానుంది.

ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయన్న టాక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిపోయింది. విదేశాల్లో చిత్రీకరించాల్సిన ఓ సాంగ్ ను రిలీజ్ డేట్ దృష్ట్యా, తొలగించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంతుందో తెలియాలంటే, మరో రెండు రోజులు ఆగాల్సిందే. త్రివిక్రమ్ మూవీకి మొదటిసారిగా ఎస్.ఎస్.థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories