హీరోయిన్ల బొడ్లు బ్లర్ చేయించారట.. ఇదేం చోద్యం

Ramba Urvashi Menaka censor update

రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్ బోర్డ్ నుండి క్లియరెన్స్ తోపాటుగా U/A సర్టిఫికేషన్ కూడా అందుకుని సెప్టెంబర్ 4 రిలీజ్ కి సిద్ధమవుతోంది.

రంభ, ఊర్వశి, మేనక అనే దేవతల పాత్రల్లో రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిష సింగ్ లు అర్ధ నగ్న వస్త్రాల్లో కనిపించడం, ఆ పాత్రల్ని ఊర్లో వాళ్ళంతా సెక్సువల్ గా చూడడాన్ని సెన్సార్ సభ్యులు తప్పుబట్టారు.

ADVERTISEMENT

తొలుత A సర్టిఫికెట్ ఇస్తామని చెప్పగా.. అల్లరి నరేష్ సినిమాకి A సర్టిఫికెట్ అంటే ఫుట్ ఫాల్స్ అండ్ కలెక్షన్స్ మీద గట్టి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి.. సెన్సార్ వాళ్ళని U/A కావాలంటే ఏం చేయాలని అడగగా.. హీరోయిన్స్ నాభి భాగం కనిపించకుండా గ్రాస్ఫిక్స్ లో చీర లాంటిది యాడ్ చేయమని చెప్పారట. సీజీకి అయ్యే ఖర్చుతో ఇంకో సినిమా తీయొచ్చు అని గ్రహించి.. ఆఖరికి హీరోయిన్ బొడ్లు బ్లర్ చేయడానికి ఒప్పుకున్నారట.

దాంతో ముగ్గురి క్లోజప్ షాట్స్ ను జూమ్ ఇన్ చేయగా.. వైడ్ షాట్స్ లో మాత్రం వాళ్ల బొడ్లను బ్లర్ చేసారు. కేవలం వీటి కోసమే థియేటర్లకి వచ్చే ఆడియన్స్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి.

అప్పట్లో ఐటెం సాంగ్స్ లో డ్యాన్సర్ యద భాగం లేదా తొడలు వంటివి మోతాదుకు మించి కనిపిస్తే.. సెన్సార్ బోర్డు బ్లర్ చేయించేది. ఇన్నాళ్లకు మళ్లీ అలాంటి బ్లర్ ఎఫెక్టులు “రంభ ఊర్వశి మేనక”కి చూడనున్నాం.

ADVERTISEMENT
Latest Stories