సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ను ‘తమ వయసెంత?’ అని మీడియా వర్గాలు ప్రశ్నిస్తే… ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ సమాధానం చెప్తారు. అలాగే ఒకవేళ మీడియా వర్గాలే ‘తన వయసు ఇంత’ అని చెప్తే… ‘అబ్బో… అంత లేదు మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు’ అనే హీరోయిన్లనే ఇప్పటివరకు చూసాం. కానీ, తొలిసారిగా తక్కువ వయసు చెప్తున్నా… నా అసలు వయసు అది కాదు, ఇది అని చెప్పుకొచ్చింది మన ‘శివగామి’ రమ్యకృష్ణ.
1985లో మలయాళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిన రమ్యకృష్ణ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వెండితెరపై అదిరిపోయే అభినయాన్ని ప్రదర్శించే రమ్యకృష్ణ వయసు గురించి, గూగుల్ వికీ పీడియాలో 46 సంవత్సరాలుగా పేర్కొంది. అయితే, తన వయసు 46 కాదు, హాఫ్ సెంచరీ అని రమ్యకృష్ణే చెప్పింది. అయితే ఇప్పటికీ వన్నె తరగని గ్లామర్ తో కనిపించే రమ్యకృష్ణకు 50 ఏళ్లు వచ్చేశాయంటే సినీ అభిమానులు నమ్మలేకపోతున్నామంటున్నారు.



