క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఎన్టీఆర్” బయోపిక్ లో కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ ను గెటప్ ను రానా ఎంతగా అనుకరించడం చూసి తాను షాక్ కు గురయ్యానని, ఒక విధంగా అసలు రానాను నేనే గుర్తుపట్టలేకపోయానని ఇటీవల సురేష్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ADVERTISEMENT
[m9ad]
సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అతిశయోక్తులు కాదని, నిజంగానే చంద్రబాబులా రానా మారిపోయారని తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయిన ఓ స్టిల్ చెప్తోంది. వైట్ అండ్ వైట్ లో నడుస్తూ వస్తోన్న రానా స్టిల్, నాటి చంద్రబాబు రూపురేఖలను జ్ఞప్తికి తెస్తోంది. దర్శకుడిగా క్రిష్ ఎంట్రీతో ఈ సినిమా మరో మలుపు తిరిగిందని భావిస్తున్న వారికీ ఇలాంటి స్టిల్స్ మరింత నమ్మకాన్ని పెంచుతున్నాయి.
ADVERTISEMENT



