నందమూరి నటసింహం ఎక్కడ ఉంటే అక్కడ హంగామా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! అది పాజిటివ్ అయినా… నెగటివ్ అయినా… బాలయ్య బాబు చేసే సందడి, ప్రస్తుత యువ హీరోలు కూడా చేయలేకపోవచ్చు. అలాంటి హంగామానే ఇటీవల ముగిసిన రానా “నెంబర్ 1 యారి” షోలో చూపించారు బాలయ్య. యాంకర్ రానానా? బాలకృష్ణనా? అన్న అనుమానం వచ్చే విధంగా అల్లరి అల్లరి చేసిన బాలయ్య తీరుకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాలయ్య పాల్గొన్న రానా షో ఏకంగా 12.52 టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. విశేషం ఏమిటంటే… బాలయ్య పాల్గొన్న ఆ వారంలో… జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ కార్యక్రమానికి ఇంతకంటే తక్కువ టీఆర్పీ వచ్చాయి. రేటింగ్స్ విషయంలో ప్రాంతీయ ఛానల్స్ లో సరికొత్త రికార్డు సృష్టించడంతో బుల్లితెరపై కూడా బాలయ్య ప్రభంజనానికి అదుపు లేకుండా పోయిందన్న విషయం అర్ధమైంది. దీంతో బాలయ్య రావడం వలన రానా కూడా కాలర్ బాలయ్యతో కలిసి కాలర్ ఎగరేసాడుగా!
నందమూరి నటసింహం ఎక్కడ ఉంటే అక్కడ హంగామా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! అది పాజిటివ్ అయినా… నెగటివ్ అయినా… బాలయ్య బాబు చేసే సందడి, ప్రస్తుత యువ హీరోలు కూడా చేయలేకపోవచ్చు. అలాంటి హంగామానే ఇటీవల ముగిసిన రానా “నెంబర్ 1 యారి” షోలో చూపించారు బాలయ్య. యాంకర్ రానానా? బాలకృష్ణనా? అన్న అనుమానం వచ్చే విధంగా అల్లరి అల్లరి చేసిన బాలయ్య తీరుకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాలయ్య పాల్గొన్న రానా షో ఏకంగా 12.52 టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. విశేషం ఏమిటంటే… బాలయ్య పాల్గొన్న ఆ వారంలో… జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ కార్యక్రమానికి ఇంతకంటే తక్కువ టీఆర్పీ వచ్చాయి. రేటింగ్స్ విషయంలో ప్రాంతీయ ఛానల్స్ లో సరికొత్త రికార్డు సృష్టించడంతో బుల్లితెరపై కూడా బాలయ్య ప్రభంజనానికి అదుపు లేకుండా పోయిందన్న విషయం అర్ధమైంది. దీంతో బాలయ్య రావడం వలన రానా కూడా కాలర్ ఎగరేసినట్లయ్యింది.