నిజమైతే అభిమానులకు పండగే

Rana Daggubati Cameo in Venky Mamaవెంకీ మామ చిత్రంతో అభిమానులకు విందు భోజనం పెట్టేలా ఉన్నారు సురేష్ బాబు. ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్యలను పూర్తి స్థాయి పాత్రలలో అభిమానులు చూడబోతున్నారు. ఇప్పుడు దానికి ఇంకో స్పెషల్ ఉందంట. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ఒక చిన్న పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు అనే వార్తలు అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ వార్త గనుక నిజమైతే ఇక వారికి పండగే.

ADVERTISEMENT

గతంలో రానా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఒక పాటలో వెంకటేష్ కనిపించరు. మరోవైపు ఈ సినిమాను అక్టోబర్ 4న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 4న విడుదల సరిగ్గా చిరంజీవి సైరా సినిమా విడుదలైన రెండు రోజులకు. ఒకరకంగా ఇది సాహసమే అని చెప్పుకోవాలి. అయితే రెండు వేరే వేరే జోనర్ సినిమాలు పైగా దసరా సెలవుల వల్ల తమకు కలిసి వస్తుందని వెంకీ మామ నిర్మాతలు భావిస్తున్నారు.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టీజర్ విడుదల సందర్భంగా దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. ఎఫ్2 తో వెంకటేష్, మజిలీతో నాగచైతన్య మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ చిత్రంతో దానిని కొనసాగించాలని అనుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories