అఖిల్ కోసం బరిలోకి దిగిన రానా?

Rana Daggubati to produce Akhil akkineni movie వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అఖిల్’ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇక విక్రమ్ కుమార్ తో అఖిల్ చేసిన ‘హలో’ సినిమా కూడా పెట్టుబడిని తిరిగి తీసుకురాలేకపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ మూడవ సినిమా ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ప్రస్తుతానికి సుకుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ADVERTISEMENT

‘రంగస్థలం’ పూర్తి చేసిన సుకుమార్ తో అఖిల్ సినిమా వుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. అఖిల్ నాల్గొవ సినిమా చేయడానికి తమిళ దర్శకుడు సత్య పినిశెట్టి ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. ఆయన ప్రయత్నాలు కొంతవరకూ ఫలించాయని కూడా అంటున్నారు.

ఇక ఈ రెండు సినిమాలకు రానా నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గురించే తండ్రి సురేశ్ బాబుతో రానా చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. ఆల్రెడీ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రానా ఒక సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories