బాలీవుడ్ ‘హాట్ బాయ్’గా పిలుచుకునే రణ్ బీర్ కపూర్ భోపాల్ జైలుకు వెళ్లనున్నాడు. టాప్ హీరోయిన్లతో ఎఫైర్లను సాగించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన రణ్ బీర్ కపూర్ జైలుకు వెళ్ళడమేంటి అనుకున్నారా? అయితే ఏదో కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళడం లేదులేండి. సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాలో ప్రధాన పాత్రను రణ్ బీర్ కపూర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్రమాయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించిన సంజయ్ దత్ పై షాట్స్ చిత్రీకరించేందుకు భోపాల్ జైలులో షూట్ చేయనున్నారు. ఈ షూటింగ్ లో భాగంగా దాదాపుగా వారం రోజుల పాటు ఈ జైలులో గడపనున్నాడు రణబీర్. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘మున్నాభాయ్ సీక్వెల్’, ‘పీకే’ వంటి ఆల్ టైం సూపర్ సినిమాల దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. హిరానీపై నమ్మకం, అనుబంధంతోనే సంజయ్ దత్ తన ఆటోబయోగ్రఫీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.



