సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో!

Ranbir Kapoor just called Sanjay Dutt a fraudప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను వంచకుడంటూ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సంబోధించడం బీటౌన్ వర్గాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్ లో నటిస్తున్న రణ్ బీర్ కపూర్ ఈ సినిమా గురించి ప్రశ్నించిన మీడియాతో… సంజయ్ దత్ అంత నిజాయితీగా ఉండడం సాధ్యం కాదని… సంజు బాబాను అభిమానించే వారున్నారు, అలాగే ద్వేషించే వారు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి అడగ్గానే సంజు బాబా నిజాయితీగా తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను వివరించారని చెప్పాడు.

ADVERTISEMENT

ఆయన నిజంగా చాలా గ్రేట్ అన్న రణబీర్, తానైతే అంత నిజాయితీగా ఉండే వాడిని కాదని అన్నాడు. సంజయ్ నిజ జీవితం నుంచి ప్రేక్షకులకు ఎంతో కొంత మంచి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ… ఈ సినిమాలో నిజాలను నిక్కచ్చిగా చూపిస్తున్నామని చెప్పాడు. దీంతో సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో వివాదాస్పద అంశాలతో పాటు, తాను సాగించిన ప్రేమాయణాలను కూడా చూపిస్తామని, తామేమీ గాంధీ బయోపిక్ తీయడం లేదని, ఒక ఫ్రాడ్ కథను తెరకెక్కిస్తున్నామని అన్న వ్యాఖ్యలు సినిమాకు పిచ్చ పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి.

ADVERTISEMENT
Latest Stories