రామ్ చరణ్ రీ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు!

rangasthalam-teaser-ram-charanక్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమా ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూసిన మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు స్పష్టత వచ్చేసింది. అంతకుముందు పుకార్లలో భాగంగా చెలరేగినట్లే… ఈ సినిమాలో రామ్ చరణ్ పోషిస్తున్న రోల్ ‘సౌండ్ ఇంజినీర్’ అని టీజర్ లో ఖరారు చేసారు. అవునండోయ్… నిజంగానే చెవుడు ఉన్న పాత్రలో చెర్రీ మెరవబోతున్నాడు. ప్రయోగాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’లా మారిన సుకుమార్, ఈ ‘రంగస్థలం’తో మరో సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధమవుతున్నాడన్న నమ్మకాన్ని టీజర్ కలిగించింది.

రామ్ చరణ్ మేకోవర్ అదిరిపోయే రేంజ్ లో ఉండగా, దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, గోదావరి అందాలు, సుకుమార్ టేకింగ్ అన్ని ఈ టీజర్ లో పర్ ఫెక్ట్ గా కుదిరాయి. ‘చిట్టిబాబు’ పాత్రలో రామ్ చరణ్ పలికిన గోదావరి యాస అంత ఎఫెక్టివ్ గా అయితే వినపడడం లేదు గానీ, తొలిసారిగా చెర్రీ స్లాంగ్ మార్చడం కొత్తదనంతో కూడుకున్నదే. మొత్తానికి రామ్ చరణ్ ను సుకుమార్ ఈ సినిమా ద్వారా రీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. మార్చి 30వ తేదీన విడుదల అని స్పష్టం చేయడంతో, ఈ ‘విజువల్ ట్రీట్’కు మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉండమని చెప్పకనే చెప్పారు.

ADVERTISEMENT

మూస మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ విమర్శల పాలైన చెర్రీకి ఇది నిజంగా సరికొత్త అనుభూతే అని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ ప్రభావితం చూపుతుంది అన్నది ఇప్పుడే అంచనా వేయలేం గానీ, ఈ సినిమా ద్వారా ఒక నటుడిగా రామ్ చరణ్ ఓ 10 మెట్లు ఎక్కడానికి అవకాశం అయితే పుష్కలంగా కనపడుతోంది. అలాగే మూస ధోరణి నుండి తాను పూర్తిగా బయటకు వచ్చేసానని, సరికొత్త కధలను ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని దర్శకనిర్మాతలకు కూడా పూర్తి స్థాయి సంకేతాలను పంపినట్లవుతుంది. అలాగే సుకుమార్ కెరీర్ లో కూడా మరో మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుందన్న సంకేతాలు కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories