పవన్ కి అన్యాయం చేసినందుకు నీకు జరగాల్సిందే

rapaka vara prasad rao audio tape leakedజనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు గెలిచిన తరువాత అధికార పార్టీ మనిషి అయిపోయారు. పేరుకి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన అధికారపక్షం తరపునే రాజకీయం చేస్తున్నారు. అయితే ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ లో సరిగ్గా పట్టించుకోవడం లేదని.. ఇప్పటికే ఉన్న నాయకులకు ఆయనకు పడటం లేదని చాలా కాలంగా మీడియాలో వినిపిస్తుంది.

ADVERTISEMENT

తాజాగా ఆయన ఒక స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడిని దుర్బాషలాడిన ఆడియో టేప్ వైరల్ అయ్యింది. పది సంవత్సరాలు నుండి పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తను మరియు ఒక మహిళా ఇంచార్జిని అసభ్యకరమైన భాషలో దుర్భాషలాడారు ఆయన. రాయడానికి వీలులేని భాషను ఉపయోగించడంతో ఆయనను అధికార పక్షంలో ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి వచ్చింది.

అయితే ఈ లీక్ తరువాత రాపాకకు అటు వైఎస్సార్ కాంగ్రెస్ లో కూడా చోట ఉండదని. రెండిటికి చెడ్డ రేవడిలా ఆయన పరిస్థితి మారుతుందని పలువురు అంటున్నారు. పవన్ కి అన్యాయం చేసినందుకు నీకు జరగాల్సిందే అంటూ జనసైనికులు ఈ పరిణామానికి ఆనందపడుతున్నారు.

రాపాక వరప్రసాద్ రావు 2019 ఎన్నికలలో ముందు వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. అయితే కొన్ని సమీకరణాల కారణంగా జగన్ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దానితో జనసేనలో చేరి గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోవడంతో రాష్ట్రమంతా రాపాక వైపు చూసింది. అయితే ఆయన పార్టీని కాదని అధికారపక్షం వైపు నిలబడ్డారు.

ADVERTISEMENT
Latest Stories