రణబాలిపై కన్నడిగుల కన్నెర్ర.. కారణమదేనా ?

ranbaali-karnataka-online-backlash

సెప్టెంబర్లో విడుదలవ్వాల్సిన “రణబాలి” షూట్ పెండింగ్ ఉండడం వల్ల వాయిదాపడి అక్టోబర్ 16న విడుదలవుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. అందులో భాగంగా రష్మిక కూడా పోస్టర్ షేర్ చేసింది.

ఈ ఏడాది ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న హీరోలందరూ కంబ్యాక్ ఇస్తుండడంతో.. విజయ్ దేవరకొండ కూడా “రణబాలి”తో హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడు అని అతడి ఫ్యాన్స్ అందరూ ఆశగా ఉన్నారు.

ADVERTISEMENT

కానీ.. రష్మిక మందన్న పోస్ట్ కింద వస్తున్న కామెంట్స్ మాత్రం చాలా నెగిటివ్ గా ఉన్నాయి. కర్ణాటకలో ఈ సినిమాని ఫ్లాప్ చేస్తాం అని కొందరు, ఇక్కడ రిలీజ్ కూడా చేయనివ్వం అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ఈ కోపం విజయ్ దేవరకొండ మీద ఉన్నది కాదు.. రష్మిక మందన్న మీద ఏళ్లుగా పెట్టుకున్న కోపం. ఆమె రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం నుండి ఈ హేట్రెడ్ మొదలైంది. అప్పటినుండి రష్మికను కుదిరినప్పుడల్లా ట్రోల్ చేస్తూనే, ఆమెపై తమ పగను ప్రదర్శిస్తూనే ఉన్నారు కన్నడిగులు.

మరీ ముఖ్యంగా టాక్సిక్ కి తెలుగు వెర్షన్ మరియు తెలుగు స్టేట్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ను కన్నడిగులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. కర్ణాటక మార్కెట్ ను పరిశీలిస్తే.. అక్కడ కన్నడ సినిమాలు తప్ప అన్నీ ఆడుతున్నాయి. ఆ విషయాన్ని కూడా తీసుకోలేక పోతున్నారు కన్నడ భాషా అభిమానులు.

రష్మిక మీద కోపం, టాక్సిక్ తెలుగు రిసెప్షన్ తాలూకు ఎఫెక్ట్ అనేది “రణబాలి” మీద ఏ స్థాయిలో పడుతుంది అనేది చూడాలి. పాన్ ఇండియన్ సినిమాగా విడుదలవుతున్న రణబాలికి ఈ తరహా హేట్రెడ్ అనేది మాత్రం అనవసరం. మరి కన్నడిగుల ఆన్లైన్ కోపం కర్ణాటకలో ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories