స్మాల్ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ పైకి!

Ravi Chevella - Bithiri Sathi busy in moviesబుల్లితెరపై ‘తీన్ మార్’ న్యూస్ లో తెలంగాణ యాస మాట్లాడుతూ ఎంతో పాపులర్ అయిన ‘బిత్తిరి సత్తి’కి తాజాగా సినీ అవ‌కాశాలు క్యూలు కడుతున్నాయి. దీంతో ఎంతో బిజీ అయిపోయిన బిత్తిరి, ఇక‌పై బుల్లితెరపై కనిపించే అవకాశం ఉండకపోవచ్చని టాక్‌. సినీ రంగంలో అవకాశాల కోసం ప్ర‌యత్నాలు చేస్తున్న స‌త్తి… ప్రత్యేకంగా ఓ మేనేజర్ ను కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ సినిమాలో బిత్తిరిసత్తి కురిపించిన న‌వ్వుల జ‌ల్లుకి మాస్ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. అలాగే గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రానున్న ‘గౌతమ్ నంద’ సినిమాలోనూ సత్తి పూర్తి స్థాయిలో క‌నిపించ‌నున్నాడు. అంతేగాక ప‌లు సినీ అవ‌కాశాలు తలుపు తడుతున్నట్లుగా తెలుస్తోంది. బుల్లితెరపై బిత్తిరి సత్తిగా న‌వ్విస్తోన్న ఆయ‌న‌ అసలు పేరు చేవెళ్ల రవి.

ADVERTISEMENT
Latest Stories