ఈ హీరోయిన్ ను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

ravi-teja-idiot-movie-heroine-Rakshita Naow and then‘ఇడియట్’ సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన రక్షిత, ఆ తర్వాత టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి, ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో ‘ఆంధ్రావాలా,’ ప్రిన్స్ మహేష్ బాబుతో ‘నిజం,’ మెగాస్టార్ చిరంజీవితో ‘అందరివాడు’ వంటి టాప్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ, కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఇండస్ట్రీ నుండి పక్కకు తప్పుకుంది.

ADVERTISEMENT

[m9ad]

కనీసం సినిమా ఆడియో వేడుకల పైన కూడా దర్శనమివ్వని రక్షితను ప్రేక్షకులు చూసి చాలా కాలమే అయ్యింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. వీక్షించిన వారందరినీ షాక్ కు గురి చేసే విధంగా ఉన్న ఈ ఫోటోలో రక్షిత లుక్ అవాక్కు చేస్తోంది. ‘ముద్దుగుమ్మ’ కాస్త ‘బొద్దుగుమ్మ’గా మారి తన అభిమానులను కూడా అవాక్కు చేసింది.

హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిన తర్వాత వారి రూపురేఖలు మారడం సహజమే గానీ, మరీ రక్షిత అవతారం మాత్రం గుర్తించలేని విధంగా మారిపోవడం విస్మయానికి గురి చేసే విషయమే. దానికి తోడు తనకు సూట్ అవ్వని కాస్ట్యూమ్స్ ను ధరించిందని ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత కనిపించిన ఈ అమ్మడి గెటప్ వీక్షకులను కాస్త భయపెట్టే విధంగానే ఉంది మరి!

ADVERTISEMENT
Latest Stories