ఫ్లాష్ న్యూస్ : తెరపైకి “ఆటో జానీ!” హీరో ఎవరు?

ravi teja puri jagannath auto janiమెగాస్టార్ 150వ సినిమా అంటూ సందడి చేసిన పూరీ జగన్నాధ్ “ఆటో జానీ” టైటిల్ విపరీతమైన ప్రచారాన్ని సొంతం చేసుకుంది. పూరీ చెప్పిన సెకండాఫ్ నచ్చలేదని చిరు ఆ ప్రాజెక్ట్ నుండి ‘డ్రాప్’ అయిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ కు చెప్పిన ఈ కధలో మున్ముందు ఏ హీరో కనపడతారనే ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. చాలా రోజుల తర్వాత తాజాగా మరోసారి “ఆటో జానీ” తెరపైకి వచ్చింది. ‘బెంగాల్ టైగర్’తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన రవితేజ, ఓ టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని భావిస్తున్నారట.

ఈ తరుణంలో… చిరు పక్కన పెట్టిన ‘ఆటో జానీ’ స్టోరీని ‘మాస్ మహారాజ’ రవితేజకు పూరీ వినిపించడం.., వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని… కృష్ణానగర్ లో చక్కర్లు కొడుతున్న విషయాలు. గతంలో పవన్ కళ్యాణ్ పక్కన పెట్టిన “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి” సినిమాలు రవితేజ కెరీర్ ను మలుపు తిప్పడంతో, తాజాగా చిరు వదిలేసిన ‘ఆటో జానీ’ కూడా రవితేజ కెరీర్ ను మరో మలుపు తిప్పుతుందని సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

పూరీ – రవితేజ కాంభినేషన్ లో ఇప్పటివరకు విడుదలైన 4 చిత్రాలలో ‘నేనింతే’ మినహా మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఒకవేళ “ఆటో జానీ” సెట్స్ పైకి వెళితే ఈ ఇద్దరి కలయికలో రూపొందబోయే అయిదవ చిత్రంగా “ఆటో జానీ” అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories