రాజా… రుచి చూపించబోతున్నాడు..!

Raja The Great Trialerసక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహారాజా రవితేజ హీరోగా నటించిన “రాజా ది గ్రేట్” సినిమా ఫస్ట్ టీజర్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన లభించిన విషయం తెలిసిందే. అలాగే విడుదలైన రెండు పాటలు కూడా పర్వాలేదనిపించే విధంగా ఉండడంతో, ప్రస్తుతం “రాజా ది గ్రేట్” సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం సినిమాల ఫేట్స్ ను ధియేటిరికల్ ట్రైలర్స్ డిసైడ్ చేస్తున్న నేపధ్యంలో….

రాజా కూడా తన రేంజ్ ను చూపించడానికి సిద్ధమవుతున్నాడు. శుక్రవారం నాడు సాయంత్రం 5.30 నిముషాలకు రవితేజ “రాజా ది గ్రేట్” సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమర్షియల్ అంశాలను కాస్త వినూత్నంగా చూపించడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా తనదైన స్థాయిలో తెరకెక్కించారని ట్రేడ్ టాక్. అక్టోబర్ 19వ తేదీన దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories