జియో ‘స్పీడ్’ తగ్గింది… అయినా నెంబర్ 1 స్థానంలోనే..!

Reliance Jio average download speed‘ఆల్ ఫ్రీ ఆఫర్’ ముగుస్తున్న తరుణంలో జియో ఇంటర్నెట్ స్పీడ్ కూడా క్రమంగా తగ్గుతూ వస్తుండడం విశేషం. జియో ఫ్రీ ఆఫర్స్ ప్రారంభమైన నాటి నుండి జనవరి వరకు ప్రతి నెలా జియో స్పీడ్ తగ్గుతూ ఉండడం గమనించదగ్గ విషయం. డిసెంబర్ లో 18.14 ఎంబీపీఎస్ గా ఉన్న స్పీడ్ జనవరి నెలకు వచ్చేసరికి 17.42కు తగ్గిపోయింది. అయితే ఇంత తగ్గినా, జనవరి నెలలో అత్యధిక స్పీడ్ అందించిన నెట్ వర్క్ లలో జియో నెంబర్ 1 స్థానంలోనే ఉండడం విశేషం.

ADVERTISEMENT

గతేడాది డిసెంబర్ లో 4వ స్థానంలో ఉన్న జియో, స్పీడ్ తగ్గించి నెంబర్ 1 స్పాట్ ను కైవసం చేసుకోవడం వెనుక మర్మమేమీ లేదు. కేవలం తన ప్రత్యర్ధి నెట్ వర్క్ లు అంతకు మించిన స్పీడ్ ను అందించలేకపోయాయి. డిసెంబర్ వరకు అగ్ర స్థానంలో ఉన్న ఎయిర్ టెల్, జనవరి నెలలో 11.24 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఏకంగా మూడవ స్థానానికి పడిపోయింది. ఐడియా 12.21 ఎంబీపీఎస్ స్పీడ్ తో రెండవ స్థానంలో నిలువగా, వోడాఫోన్ 8.33 ఎంబీపీఎస్ వేగంతో నాలుగవ స్థానంలో నిలిచింది.

ఈ తాజా నివేదికతో తేలిన విషయం ఏమిటంటే… ఏ నెట్ వర్క్ కూడా వినియోగదారులకు సరైన 4జీ వేగాన్ని అందించడం లేదని స్పష్టమవుతోంది. 4జీ వేగం పేరుతో వినియోగదారులతో నెట్ వర్క్ లు ఆడుకుంటున్నాయని, మరో రకంగా చెప్పాలంటే… వినియోగదారులకు ఉచితంగా నెట్ ను అందిస్తున్న జియోను పక్కన పెడితే, రీ చార్జ్ ల పేరుతో కస్టమర్ల నుండి దోచుకుంటున్నారని అర్ధమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories