జియో ఆఫర్లలో కన్ఫ్యూషన్ వద్దు… మొత్తం వివరాలివే..!

Reliance Jio extended offers detailsమార్చి 31వ తేదీతో రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్‌షిప్‌ తో పాటు టారిఫ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. బుధవారం నుంచి మెంబర్‌ షిప్ నమోదు కార్యక్రమం మొదలైంది. ప్రైమ్ మెంబర్‌ షిప్ కావాలనుకునేవారు తొలుత 99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సభ్యత్వం కనుక తీసుకుంటే ఇప్పుడున్న ఆఫర్‌ ను మరో ఏడాది పాటు పొందే వీలుంటుంది. అంటే నెలకు 303తో రీ చార్జ్ చేసుకోవడం ద్వారా రోజుకు 1జీబీ 4జీ హైస్పీడ్ డేటాతో పాటు ప్రస్తుతం అందుకుంటున్న ఆఫర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.

ADVERTISEMENT

అంటే 1జీబీ ముగిసిన తర్వాత కూడా 128 కేబీపీఎస్ తో డేటా వస్తుంది. ఒకవేళ 303తో రీ చార్జ్ చేయించుకోలేని వారి కోసం 149 రూపాయల ఆఫర్ కూడా ఉంది. ఇందులో వాయిస్ కాల్స్ ఉచితమే గానీ, నెలకు కేవలం 2జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఒకవేళ మెంబర్ షిప్ పొంది ప్రతి నెలా కనీస రీ చార్జ్ (149తో) చేయించుకోలేదంటే, మెంబర్ షిప్ కూడా రద్దవుతుంది. అలాగే ఈ కనీస రీ చార్జ్ చేయించుకోని సమయంలో 90 రోజుల వరకు ఇన్ కమింగ్ కాల్స్ వస్తాయి, ఆ తర్వాత నెంబర్ ఆటోమాటిక్ కాన్సిల్ కాబడుతుందని జియో స్పష్టం చేసింది.

దీంతో పాటు ప్రైమ్ మెంబర్ల కోసం ‘జియో’ తాజాగా మరికొన్ని ప్లాన్లు విడుదల చేసింది. వాటి ప్రకారం జియో ప్రైమ్ మెంబర్లు, నాన్ ప్రైమ్ యూజర్లకు అందే డేటా ప్యాక్‌లలో తేడాలను గమనిస్తే… 19 రూపాయల ప్లాన్ ద్వారా ప్రైమ్ యూజర్లు ఒక రోజు వ్యాలిడిటీతో 200 ఎంబీ డేటా పొందొచ్చు. అదే నాన్ ప్రైమ్ యూజర్లకు అయితే 100 ఎంబీ డేటా మాత్రమే. అలాగే 49 ప్లాన్‌ తో ప్రైమ్ మెంబర్లు 3 రోజుల వ్యాలిడిటీతో 600 ఎంబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. నాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రం 300 ఎంబీనే అందుతుంది.

96 ప్లాన్‌ తో ప్రైమ్ యూజర్లు 7 రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ పొందొచ్చు. నాన్ ప్రైమ్ మెంబర్లుకు మాత్రం 600 ఎంబీనే ఇస్తారు. 149తో ప్రైమ్ మెంబర్లకు 28 రోజల వ్యాలిడిటీతో 2జీబీ డేటా, నాన్ ప్రైమ్ మెంబర్లకు 1జీబీ డేటా లభిస్తుంది. 303తో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రైమ్ మెంబర్లకు 30 జీబీ డేటా, నాన్ ప్రైమ్ మెంబర్లకు 2.5జీబీ డేటా, 499తో ప్రైమ్ మెంబర్లకు 58జీబీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. 999 ప్లాన్‌తో ప్రైమ్ మెంబర్లకు 60 రోజుల వ్యాలిడిటీతో 60జీబీ, నాన్ ప్రైమ్ మెంబర్లకు 12.5జీబీ డేటా పొందవచ్చు.

ADVERTISEMENT
Latest Stories