‘అన్ లిమిటెడ్’పై రిలయన్స్ ‘జియో’ తాజా ప్రకటన!

reliance-jio-latest-annoucement-on-tariffsతాము డేటాకు మాత్రమే చార్జ్ వసూలు చేస్తామని, వాయిస్ కాల్స్ మాత్రం ఉచితం అని చెప్పిన రిలయన్స్ జియో మాటల్లో, అసలు విషయం దాగి ఉందని, ఆ ఉచిత కాల్స్ విషయంలో ఓ చిన్న మెలిక ఉందని ఇటీవల జరిగిన ప్రచారం తెలిసిందే. జియో టు జియో అన్ లిమిటెడ్ అని, ఇతర నెట్ వర్క్ లకు మాత్రం నెలకు కేవలం 1000 నిముషాలు మాత్రమేనని ప్రచారం జరగడంతో, జియో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా ఈ ‘అన్ లిమిటెడ్’ కాల్స్ పై జియో వివరణ ఇచ్చుకుంది.

ADVERTISEMENT

జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి మొదటి 1000 నిమిషాలు మాత్రమే ఉచితమని బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ చెప్పడాన్ని ఖండిస్తూ… ఇలా పేర్కొనడం సరికాదని, ఇందులో నిజం లేదని తమ వినియోగదారులు, 99 రూపాయలతో వార్షిక సభ్యత్వం స్వీకరించిన తరువాత ఎంచుకున్న నెలవారీ రీచార్జ్ తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుకోవచ్చని స్పష్టం చేసింది. 149, 303, 499 రీచార్జ్ లతో నెల రోజులు అన్ని కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చని, డేటా మాత్రమే మారుతుంటుందని, సదరు వివరాలన్నీ ‘మై జియో’ యాప్ లో కూడా పొందుపరిచామని పేర్కొంది.

ఇదిలా ఉంటే, 99 రూపాయిలతో ప్రైమ్ మెంబర్‌ షిప్ పొందే క్రమంలో ఆన్‌ లైన్‌ లో ప్రయత్నిస్తున్న జియో యూజర్లలో చాలామందికి నిరాశ ఎదురవుతోంది. ఆన్‌ లైన్ ద్వారా ఈ సభ్య‌త్వం పొందాల‌ని చూస్తోన్న వారికి కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర‌వుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన జియో యాజ‌మాన్యం… వినియోగదారులు ఒక్కసారిగా ప్రయత్నించడంతో తలెత్తిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలుపుతూ… త్వరలోనే మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. మ‌రికొంద‌రు జియో యూజ‌ర్లు ఆన్‌ లైన్‌లో డబ్బు చెల్లించినప్పటికీ, తమకు ప్రైమ్ యాక్టివేట్ కాలేద‌ని వాపోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories