‘జియో’ నుండి తృటిలో తప్పించుకున్న ‘కుటుంబం’

Reliance Jio LYF Mobile Phone Blasted‘ఆల్ ఫ్రీ’ అంటూ దేశీ టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో లైఫ్ మొబైల్ ను వినియోగిస్తున్న వారందరికీ షాకింగ్ న్యూస్. ఇప్పటివరకు సాంసుంగ్ మొబైల్స్ మాత్రమే పేలుతూ హల్చల్ చేయగా, తాజాగా ఆ కోవలోనే లైఫ్ మొబైల్ చేరుకుంది. తాను వాడుతున్న లైఫ్ బ్రాండ్ 4జీ ఫోన్ ఒక్కసారిగా పేలిందని చెబుతూ, తన్వీర్ సాధిక్ అనే యువకుడు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని చెబుతూ, పేలిన రిలయన్స్ జియో లైఫ్ ఫోన్ చిత్రాలను పోస్ట్ చేసారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించడంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మరింతగా వేగంగా దూసుకెళుతోంది. ఈ విషయం తెలుసుకున్న రిలయన్స్, ఫోన్ పేలిన విషయంలో పూర్తి విచారణ జరిపించనున్నట్టు ప్రకటించింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories