మోడీ ‘టాప్’… బ్యూటీ ‘పాట్’…!

Remya Nambeesan satire on narendra modiబెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘టాప్’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి, మాజీ ఎంపీ, సినీ నటి రమ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగళూరు ర్యాలీలో మాట్లాడిన మోడీ… రైతులే తనకు ‘టాప్’ (టి-టమోటా, ఒ-ఆనియన్, పి-పొటాటో) ప్రాధాన్యమని పేర్కొన్నారు. మోడీ వ్యాఖ్యలకు స్పందనగా రమ్య ట్వీట్ చేస్తూ… మీరు ‘పాట్’ (పీవోటీ- మత్తు)లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుందన్నమాట అని పేర్కొన్నారు.

రమ్య ట్వీట్‌పై దుమారం చెలరేగడంతో మరోమారు స్పందిస్తూ… పాట్ అంటే ‘పొటాటోస్, ఆనియన్స్, టమోటాస్’ అని ఎందుకు అనుకోకూడదంటూ తనను తాను సమర్థించుకున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ‘డ్రగ్స్ మత్తు’ అనే అర్థంలోనే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమ్యపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ADVERTISEMENT

రమ్య ట్వీట్‌లోని అర్థమేంటో తనతో సహా దేశంలోని బీజేపీ నేతలెవరికీ తెలియదని, కానీ రాహుల్‌కు మాత్రం వెంటనే అర్థమైపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. కాగా రమ్య ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రమ్యతో సహా ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు.

ADVERTISEMENT
Latest Stories