పవన్ గుట్టు విప్పనుందా?

Renu Desai opens on Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణిగా రేణుదేశాయ్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ, పవన్ ను వివాహం చేసుకున్న తర్వాత తెలుగు భాషను పూర్తిగా నేర్చుకున్న రేణు జీవితంలో ప్రస్తుతం పవన్ లేరన్న విషయం తెలిసిందే. అధికారికంగా పవన్ – రేణులు విడిపోయినా, పిల్లల కార్యక్రమాల కోసం ఇరువురు అప్పుడప్పుడు కలుసుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.

ఇప్పటికీ స్నేహితుల మాదిరి మాట్లాడుకునే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు? అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్న. తెరవెనుక అసలేం ఏం జరిగింది? అన్న ప్రశ్న తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణుకు ఎదురయ్యింది. దీనికి సమాధానం చెప్పింది. అవును… ఈ ప్రశ్నకు జవాబు ఎప్పుడు చెప్తాననే సమాధానం ఇచ్చింది తప్ప, వీరిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం బయట పెట్టలేదు.

ADVERTISEMENT

ఒక సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన తాను ఫస్ట్ లుక్ లోనే పవన్ ను ప్రేమించడం మొదలుపెట్టానని, ఆ తర్వాత ‘లివింగ్ టూగెదర్’ రిలేషన్ షిప్ అంటే భయం వేసినా, కొనసాగానని, తామిద్దరం విడిపోయినపుడు పిల్లల భవిష్యత్తు కోసం పవన్ పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చారన్న వార్తలను మీరు కూడా నమ్ముతున్నారా? అంటూ సదరు మీడియా ప్రతినిధి ప్రశ్నపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రేణు ఈ ఇంటర్వ్యూలో అత్యంత ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఫుల్ ఇంటర్వ్యూ మాత్రం ఆదివారం నాడు బుల్లితెరపై సందడి చేయనుంది. మరి ఈ ఇంటర్వ్యూలో పవన్ గుట్టు విప్పుతుందో? లేదో గానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆసక్తికరంగా వేచిచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories