పవన్ కళ్యాణ్ పై ఆ హక్కు ఉంది!

Renu Desai owns Pawan Kalyan post Divorce పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయడంపై మాజీ భార్య రేణూ దేశాయ్ పై అనుచిత కామెంట్స్ చేసిన వారిపై తీవ్రంగా స్పందించారు. ‘తానేమీ పవన్ ను కాకా పట్టడం లేదని, 17 సంవత్సరాలుగా నేను పవన్ కి బెస్ట్ ఫ్రెండ్ ని. పైగా 11 ఏళ్ళు ఆయనతో కలిసి జీవించాను.. ఇద్దరు పిల్లలకు తండ్రి ఆయన.’ అంటూ పవన్ కళ్యాణ్ పై తనకున్న హక్కును ఈ సందర్భంగా చాటిచెప్పారు.

‘ప్రపంచం మొత్తం పవన్ కల్యాణ్ గురించి మాట్లాడొచ్చు కానీ, నేను మాత్రం ఎందుకు మాట్లాడకూడదు? పవన్ తో విడాకులు తీసుకున్నందుకే నన్నిలా విమర్శిస్తున్నారా? గత ఆరేళ్లుగా తమ పిల్లల కోసం అప్పుడప్పుడూ పవన్, తాను కలుస్తున్నామని, పవన్ గురించి తాను మాట్లాడకూడదని కొంతమంది ఎందుకు ప్రశ్నిస్తున్నారో తనకు అర్థం కాలేదని పేర్కొంది. చిన్న కారణం వల్ల తాము విడాకులు తీసుకున్నామని, తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని రేణు దేశాయ్ స్పష్టం చేసారు.

ADVERTISEMENT

పవన్ రాజకీయరంగ ప్రవేశంపై మీకు ఇప్పుడే తెలుసు, కానీ ఆ విషయం నాకు ఏనాడో తెలుసు. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఆయన నోట్స్ ప్రిపేర్ చేసుకునేవారు. నేను చేసే టీ అంటే ఆయనకెంతో ఇష్టం.. అంత రాత్రివేళ కూడా పవన్ కు టీ ఇచ్చేదాన్ని… అని గత అనుభూతులను పంచుకున్న రేణూ దేశాయ్, కొందరికి ఇష్టం లేకున్నా తాను పవన్ ఫోటోలను పోస్ట్ చేయడం మాననని స్పష్టం చేశారు.

ADVERTISEMENT
Latest Stories