రేణూ ఆటోబయోగ్రఫీలో పవన్ తో విడాకులు!

Renu Desai - Pawan Kalyan Biography‘జనసేన’ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా పలు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కు సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడి అభిమానుల్లో ఆసక్తి రేపింది. పవన్ తో సహజీవనం, వివాహం, పిల్లలు, విడాకులు ఇలా తన జీవితంలో అన్నీ చాలా తొందరగా జరిగిపోయాయని, విడాకులు తీసుకున్నప్పటికీ తమ మధ్య స్నేహం చెరిగి పోలేదని చెబుతోంది.

తమ స్నేహితులు తనను దీనిపై చాలా సార్లు ప్రశ్నించారని… ఇంత బాగుంటారు కదా? విడాకులెందుకు తీసుకున్నారు? అని అడుగుతారని, అయితే విడాకులకు తన కారణాలు తనకు ఉన్నాయని చెప్పిన రేణూ దేశాయ్, వాటిని తన ఆటోబయోగ్రఫీలో పూర్తిగా వివరిస్తానని తెలిపింది. పవన్ తో విడాకుల అనంతరం మరాఠాలో రెండు సినిమాలకు నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రేణూ దేశాయ్ కొంత కాలంగా గ్యాప్ తీసుకుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories