రేణు దేశాయ్ ఈ పేరు మీద ఏ వార్త మీడియాలోకి చర్చకు వచ్చినా అది వెంటనే వైరల్ అవుతుంది. అయితే వైసీపీ వాళ్ళు లేకుంటే పవన్ అభిమానులు ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టులను వెంటనే వైరల్ చేస్తుంటారు. దీనికి ముఖ్య కారణం అందరికి తెలిసిందే అయినప్పటికీ ఈమె పవన్ మాజీ భార్య కావడమే.
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటారు. తన అభిప్రాయాలను పంచుకోవడానికి, తన ఆనందాన్ని, బాధను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా అనే మాధ్యమాన్ని ఎక్కువగా వాడుకుంటారు రేణు. అయితే ఇప్పుడు రేణు ఒక రాజకీయ నేత మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
హైద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత ను ఉద్దేశించి ఒక పోస్ట్ చేసారు రేణు. చాలా కాలం తరువాత ఒక స్ట్రాంగ్ మహిళను చూస్తున్నా అంటూ మాధవిలతకు మద్దతు పలికారు. అయితే ఈ పోస్ట్ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని చేయలేదని కేవలం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ మాధవిలత ఫోటోను షేర్ చేసారు.
దీనితో రేణు మద్దతు మాధవిలతకే పరిమితమవుతుందా లేక బీజేపీ, అటు నుంచి కూటమి దాకా వస్తుందా అంటూ ఊహాగానాలు మొదలు పెట్టారు. రేణు దేశాయ్ పోస్టుల కోసం పవన్ అభిమానుల కంటే వైసీపీ అభిమానులే ఆతృతగా ఎదురుచూస్తుంటారు. వారికి అనుకూలంగా ఒక్క వార్త ప్రచారంలోకి వచ్చినా దాన్ని సాకుగా చూపించి కూటమి పై ఎదురుదాడి చేయవచ్చు అని కళ్ళలో ఒత్తులు వేసుకుని మరి శోధిస్తుంది వైసీపీ సోషల్ మీడియా.




