రేవంత్ రెడ్డి టీడీపీ మూలాన్ని మార్చగలరా?

Revanth Reddy -గతంలో టీడీపీలో ఉంటూనే ఆ పార్టీని కాంగ్రెస్ తో పొత్తు వైపు నడిపించే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి తరువాతి కాలంలో కాంగ్రెస్ లోనే చేరిపోయారు. అయినా ఆయన తన ప్రయత్నాలు ఆపలేదు. తెలంగాణలో టీడీపీ…కాంగ్రెస్‌తో కలిస్తేనే బెటర్‌. అలా అయితే ఆ పార్టీలో ఉన్న ఆ కొందరైనా ఎమ్మెల్యేలు అవుతారు అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయం, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అనేది బూజు పట్టిన సిద్ధాంతం అని, దానిని పక్కన పెడితేనే టీడీపీకు తెలంగాణాలో మనుగడ అని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వారంతా 2014 ముందు టీడీపీలో జేరి ఇప్పుడు ముఖ్యపదవులలో ఉన్న సంగతి ఆయన ఈ సంధర్భంగా గుర్తు చేసారు.

ADVERTISEMENT

అయితే రేవంత్ రెడ్డి టీడీపీ మూలాన్ని మార్చగలరా? కాంగ్రెస్ తో పొత్తు అంటే దాని ప్రభావం ఆంధ్ర రాజకీయంపై ఉంటుంది. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీతో దోస్తీ అని వేరే పార్టీలు దుమ్మెత్తి పోస్తాయి. కాబట్టి అది అంత తేలికైన నిర్ణయం కాదు. దానికి తోడు తెలంగాణాలో అటువంటి పొత్తు ఏ మేరకు ఉపయోగపడుతుందో ఎవరికీ తెలీదు.

ADVERTISEMENT
Latest Stories