ఈ మాత్రం దానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నాడా?

Revanth Reddy TDP (TS)తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ కావడం దాదాపు ఖరారు అయిపోయిందని కొన్ని మీడియా వర్గాల కథనాలు. రేవంత్ రెడ్డి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కూడా అదే సంకేతం ఇచ్చింది. కాంగ్రెస్లో చేరితే రేవంత్‌ రెడ్డికి వర్కింగ్‌ ప్రసిడెంట్‌తో పాటు ప్రచార బాధ్యతలు ఇవ్వాన్నున్నారని తెలిసింది.

మరో వైపు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణా కాంగ్రెస్ లో కొన్ని కీలక పదవులకు పేరులు ఖరారు చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌,ఇంఛార్జ్‌గా కుంతియా కొనసాగింపు నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్లకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదా ఇచ్చింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఇప్పటిదాకా ఉన్న భట్టి విక్రమార్క తో పాటు పొన్నం ప్రభాకర్, దానం నాగేంద్రకు కూడా ఛాన్స్‌ ఇచ్చారు.

ADVERTISEMENT

రేవంత్ రెడ్డికి కూడా అవే పదవులు ఇస్తే ఏం ఉపయోగం అనేది ఆయన ఆలోచించుకోవాలి? అంత మంది సీనియర్ల మధ్య కొత్తగా పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ప్రభావం చూపించగలడు అనేది మరో ప్రశ్న? గుంపులో గోవింద అన్న చందాన ఉంటే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఇమడ లేడు అనేది అందరికి తెలిసిందే.

మరో వైపు రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్‌ పార్టీలో చేరిక విషయం నాకుతెలియదు అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పార్టీలో చేరికలపై ఇప్పుడు ఏం మాట్లాడను అని ఆయన వెంటనే అనడంతో మరిన్ని ఊహాగానాలకు తావు ఇచ్చినట్టు అయ్యింది. తొందరలొనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారు, ఆలోగానే రేవంత్ చేరికా ఉండొచ్చని పుకార్లు షీకరు చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories