రేవంత్ విలన్స్ యే కవిత దెయ్యాలా.?

Revanth Reddy Targeted KTR

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో రెండు కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత పాలకుల అవినీతి మీద విచారణకు ఆదేశించాయి. అందులో భాగంగానే ఏపీలో లిక్కర్ స్కాం హల్చల్ చేస్తుంటే, తెలంగాణలో ఫోన్ టాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్ కేసు హడావుడి చేస్తున్నాయి.

అయితే ఈ అన్ని కేసులలోను పార్టీ బాసులే అంతిమ లబ్ధిదారులు, వారి ప్రోత్సహంతోనే ఈ స్థాయి అవినీతి, అక్రమాలు అనేది అధికార పార్టీల వాదన. అయితే నేడు మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో నడుస్తున్న కేసుల విచారణ పై స్పందించారు.

ADVERTISEMENT

గత ప్రభుత్వ అవినీతి పై విచారణ జరుగుతుంది, కేటీఆర్ డ్రగ్స్ కేసు పైన కూడా విచారణ వేగవంతమయ్యింది. అయితే విలన్లు మాత్రం క్లైమాక్ లోనే అరెస్టవుతారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.

విలన్లు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ ను ఉద్దేశించినవే అనేది రాజకీయ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో నేడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను  సరిపోల్చుతూ నాటి దెయ్యాలే నేటి విలన్లుగా మారారా అంటూ సోషల్ మీడియాలో కేటీఆర్ కు వ్యతిరేకంగా కౌంటర్లు పేలుతున్నాయి.

ఇప్పుడు బిఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ కి తోడు జాగృతి, కేటీఆర్ కు రేవంత్ రెడ్డి తో పాటు ఇంటి గుట్టు రట్టు చెయ్యగలిగిన విభీషణుడి పాత్రలో కవిత సిద్ధంగా ఉన్నారు. మరి రేవంత్ చెపుతున్న క్లైమాక్ విలన్లు ఎవరో.? కవిత చెప్పిన దెయ్యాలు ఎవరో తెలియాలి అంటే కేసుల విచారణ క్లైమాక్స్ కు చేరాల్సిందేనా.? బిఆర్ఎస్ vs కవిత రాజకీయ యుద్ధం అంతిమ ఘట్టానికి రావాల్సిందేనా.?

ADVERTISEMENT
Latest Stories