రాజకీయాలు అభివృద్దికి అవరోధమే.. కానీ తప్పడం లేదు!

Revanth Reddy vs KCR

“కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు… ఆ తర్వాత మా దృష్టంతా పాలన, అభివృద్ధిపైనే,” అనే ఈ డైలాగ్ తరచూ వింటూనే ఉంటాము. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎన్నికల వరకు రాజకీయాలే ఎక్కువ చేస్తుంటారు. లేకుంటే ప్రతిపక్ష పార్టీలు చేసే రాజకీయాలకు ప్రభుత్వాలు కూలిపోవచ్చు లేదా ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. కనుక పూర్తి 5 ఏళ్ళు రాజకీయాలు, రాజకీయ నిర్ణయాలు తప్పవు.

ఇదివరకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగాన్నప్పుడు ముందుగా ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేశారు. ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. అంటే రాజకీయాలు తగ్గితే అభివృద్ధి జరుగుతుందని నిరూపితమైంది.

ADVERTISEMENT

నాడు తెలంగాణని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌ పార్టీయే ఆరు నెలల్లోగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని బెదిరించింది. బీఆర్ఎస్‌ రాజకీయాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అడుగడుగునా బ్రేకులు వేస్తూనే ఉంది. సిఎం రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్‌లా నిరంకుశంగా వ్యవహరించకుండా బీఆర్ఎస్‌ హయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి వారికి ముక్కు తాడువేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏమీ చేయలేక పోతున్నారు. ఎందుకంటే, కేంద్రం అడ్డుపడుతోంది… కేసీఆర్‌, కేటీఆర్‌లని కాపాడుతోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కనుక బీఆర్ఎస్‌ పార్టీతో నిరంతరంగా రాజకీయ పోరాటాలు చేయక తప్పడం లేదు.

ఏపీలో వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేనప్పటికీ అది కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇలాగే ముప్పతిప్పలు పెడుతోంది. సిఎం చంద్రబాబు నాయుడు ఓ పక్క దాని దుష్ప్రచారాన్ని, రాజకీయాలను ఎదుర్కొంటూనే సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం కూడా మద్యం కుంభకోణం కేసుతో వైసీపీని కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ ఈ కేసులో అంతిమ లబ్దిదారుని టచ్‌ చేయలేకపోతోంది. ఈ కేసులో మిగిలినవారు ఇలా లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చేస్తున్నారు. బయటకు రాగానే కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి కూడా చేస్తున్నారు.

బీజేపికి కాంగ్రెస్‌ పార్టీ బద్ధ శత్రువు కనుక కేంద్ర ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డికి సహకరించకపోవడం సహజమే. కానీ ఎన్డీయే టీడీపి ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపి భాగస్వామిగా ఉంది. కానీ ఏపీలో వైసీపీని, తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీని కేంద్రమే కాపాడుతోందా? ఎందుకు?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories