ఇది రివ్యూ ప్రూఫ్ వీకెండ్

Review Proof Weekend: Sing Geetham vs Disclosure Day

ఒక సినిమాపై రివ్యూల ఎఫెక్ట్ ఎంత అనేందుకు ఒక కొలమానం అనేది లేదు. బాగున్న సినిమాలకి రివ్యూలు కాస్త ఊతమందిస్తే.. బాలేని సినిమాలకి ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలిసేలా చేయడమే రివ్యూల లక్ష్యం. అయితే కాలంతోపాటు రివ్యూల ధోరణి కూడా మారింది. ఈమధ్యకాలంలో ఎజెండా లేని రివ్యూలు తక్కువైపోయాయి. ప్రతివారం విడుదలయ్యే సినిమాలకి అయితే పెయిడ్ రివ్యూలు లేదంటే హేట్రెడ్ తో నిండిపోయిన సమీక్షలు సర్వసాధారణమైపోయాయి.

అయితే.. ఈ జూన్ రెండో వారం రివ్యూ ప్రూఫ్ వీకెండ్ గా మారింది. ఈ వారం ఇద్దరు లెజెండరి ఫిలిం మేకర్స్ తమ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించకున్నారు. సింగీతం శ్రీనివాస రావు “సింగ్ గీతం” అంటూ 94 ఏళ్ల వయసులో నాగ్ అశ్విన్ నేతృత్వంలో సంకల్ప్ అనే యువకుడితో తీయించిన సినిమాతో, ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని కాన్సెప్ట్ తో ఓ గొప్ప ప్రయత్నం చేసారు. ఇక స్టీవెన్ స్పీల్ బర్గ్ 79 ఏళ్ల వయసులో “డిస్క్లోజర్ డే” అనే సినిమాతో ఎంగేజ్ చేయడానికి సిద్ధమయ్యాడు.

ADVERTISEMENT

ఈ రెండు సినిమాల్ని ఎక్స్ పీరియన్స్ చేసి, ఆ సినిమాల అనుభూతుల్ని పంచుకోవడమే కానీ కంప్లైన్ చేసే స్థాయి సినిమాలు వాళ్లు చేయరు. ఎందుకంటే వాళ్ళు సాధించుకున్న క్రెడిబిలిటీ అలాంటిది. రెండు సినిమాలు కూడా మల్టీప్లెక్స్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందిన సినిమాలే. సో, ఈ వీకెండ్ మాత్రం రివ్యూలు, ఒపీనియన్స్ తో పట్టింపు లేకుండా జనాలు థియేటర్లలో సందడి చేస్తారు. మరి ఈ లెజండరీ ఫిలిం మేకర్స్ ఆడియన్స్ ని ఏమేరకు ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories