పెద్దాయన్ని పెట్టుకుని ఇదేం పద్ధతి ?

rgv-amitabh-bachchan-sarkar-3-controversiesవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి బాహ్య ప్రపంచానికి తెలియనిది ఏదీ లేదు. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని చెప్తూ అన్నీ ఓపెన్ గా మాట్లాడే వర్మ, తన సినిమాలు విడుదల దగ్గరికి వచ్చేపాటికి మాత్రం… ఆ “ఓపెన్” కాస్త ఎక్కువై “వివాదానికి” దారి తీస్తుంది. దాని ఫలితంగా… విడుదల కాబోయే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది. ఇది ఈ రోజు కొత్తగా వర్మ కనిపెట్టిన విషయమేమీ కాదు, గత కొన్నేళ్ళుగా విజయవంతంగా వర్మ అమలు చేస్తున్న విధానమే… అందరికీ సుపరిచితమే కూడా..!

తాజాగా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు వర్మ. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “సర్కార్ 3” సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ లభించే విధంగా గత కొన్ని రోజులుగా వర్మ చేస్తున్న హడావుడి అందరికీ తెలిసిందే. ‘మహిళా దినోత్సవం’ వంటి కొన్ని అంశాలు వర్మకు సరికొత్త ఆహారాన్ని అందివ్వగా, మరికొన్నింటిపై తనదైన శైలిలో స్పందించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అయితే సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ అయిన అమితాబ్ బచ్చన్ ను సినిమాలో ఉంచుకుని కూడా వర్మ ఇలాంటి చీప్ పబ్లిసిటీ చేసుకోవాలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ADVERTISEMENT

ఓ సినిమాలో అమితాబ్ నటించడమే పెద్ద పబ్లిసిటీ. దానికి తోడు ‘సర్కార్’ అనేది సూపర్ హిట్ సిరీస్. రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఆటోమాటిక్ గా క్యూలో నిల్చునే సినీ అభిమానులకు కొదవలేదు. ఇలాంటి సందర్భాలలో వర్మ రెగ్యులర్ గా ఫాలో అయ్యే చీప్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ‘ఐస్ క్రీం’ లాంటి సినిమాకు, ‘సర్కార్ 3’ లాంటి సినిమాకు ఒకే విధమైన పబ్లిసిటీ ప్లాన్ చేస్తే… ఇంకా సినిమాలో ఉన్న అమితాబ్ కు విలువేముంటుంది? మరి ఇలాంటి విషయాలు అసలు వర్మకు తట్టేనా? ఒకవేళ ఎవరైనా చెప్పినా వినేనా?

ADVERTISEMENT
Latest Stories