ఇదేనా వికాసం అంటే? పవన్ పై ఫైర్ అయిన వర్మ!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను ఉద్దేశిస్తూ… ఓ పెళ్లైన కూతురు కూడా ఉన్న వ‌ర్మ‌, పోర్న్‌ సినిమాలు చూస్తానని చెప్పుకుంటారని, ఆయన గురించి తానేం మాట్లాడనని… జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్ పై ట్విట్టర్‌ వేదికగా వర్మ ఫైర్ అయ్యారు. “తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిగా ప‌లు ఎక్స్ పెక్టేషన్స్ తో మాట్లాడాను గానీ, ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల లాంటి వ్యక్తిగత విషయాలపై తానెప్పుడూ మాట్లాడ‌లేద‌ని” వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

త‌న లైఫ్ స్టైల్ తాను ఆలోచించే విధానాన్ని దాచుకోకుండా, దాక్కోకుండా తాను రాసిన‌ పుస్తకం ‘నా ఇష్టం’లో మెత్తం విప్పి రాశాన‌ని, వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడారని కొన్ని రోజుల క్రిత‌మే యండమూరి వీరేంద్రనాథ్‌ ని తిట్టారని, మరి వాళ్లు వేరే వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసం అంటే? అంటూ ప‌వ‌న్‌ ను ప్ర‌శ్నించారు. తాను పవన్ మీద ఇష్టంతో నిజాయితీగా మాట్లాడానని, ఆయ‌న‌ను విమ‌ర్శ‌లు చేయ‌డానికి కాద‌ని ప‌వ‌న్‌ తెలుసుకోలేకపోవటం త‌న‌‌ దురదృష్టమ‌ని అన్నారు.

ADVERTISEMENT

చివరగా… పవన్ కళ్యాణ్ కు, అతని భార్యకు, పిల్లలకు, కుటుంబానికి, జనసేన పార్టీకి, పవన్ అభిమానుల‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు… గుడ్ బై చెప్పారు. తాజా పరిణామాలతో పవన్ పై భవిష్యత్తులో స్పందించరేమో సంకేతాలను వర్మ ఇచ్చారు. గతంలో ఓ సారి కూడా ఇలాగే పవన్ పై ఇక ట్వీట్లు చేయను అని చెప్పి, మరికొద్ది రోజులకే మళ్ళీ మొదలుపెట్టిన వైనం తెలిసిందే. బహుశా పవన్ నుండి బయటపడేందుకో ఏమో గానీ, వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను తగులుకున్నారు వర్మ.

ADVERTISEMENT
Latest Stories