“పస”లేని సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ!

RGV - Lakshmis NTRదర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాపం పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నాడు. వైకాపా పార్టీకి చెందిన కొందరు లక్ష్మీ పార్వతిని సంప్రదించి మరీ లక్ష్మిస్ ఎన్ఠీఆర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలి అన్న ఆలోచన కన్నా, ఇంకా చెప్పాలి అంటే అసలు జరిగింది చూపించాలి అన్న విషయం కన్నా, ఈ సినిమాకి పబ్లిసిటీ చేసుకోవాలి అన్న ఆత్రమే పాపం ఆర్జీవీలో కనిపిస్తుంది.

అందుకే లక్ష్మి పార్వతికి- చంద్రబాబు మధ్య జరిగిన వ్యవహారాన్ని ప్రధానంగా చేసుకుని ‘వెన్నుపోటు’ అనే పాటను విడుదల చేసి సినిమాపై అట్టెన్షన్ పెంచడానికి ట్రై చేసాడు వర్మ. అయితే దీనిపై అటు ప్రేక్షకుల్లో కానీ, మీడియా వర్గాల్లో కానీ, ఇంకా చెప్పాలి అంటే ఎన్ఠీఆర్ కుటుంభంలో కానీ ఎక్కడా చర్చించుకునే ఆలోచన రాలేదు ఇప్పటివరకూ. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆర్జీవీని టార్గెట్ చేశారు, అది ఒక్కటి మినహాయిస్తే అసలు ఈ సినిమాని ఎవ్వరు పట్టించుకునే అవకాశం లేకుండా ఉంది.

ADVERTISEMENT

ఇక ఇదే సినిమాపై బాలయ్య మాట్లాడుతూ ఏ సినిమా తీయాలన్నది ఆయన వ్యక్తిగతం. ఆయన ఇష్టం. ఆయన మా అనుమతి కోరలేదు…లైట్ తీసుకోమన్నారు.

మరి సినిమాలో మ్యాటర్ ఏముందో తెలీదు కానీ, ఆర్జీవీ మాత్రం ఎన్ఠీఆర్ బయోపిక్ కి ధీటుగా తన సినిమాని ప్రమోట్ చేసుకోవాలి అని తెగ తపన పడిపోతున్నాడు. మరి ఈ తపన ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories