ఇద్దరు అత్యుత్తమ క్రీడాకారులు పోటీపడితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ క్రీడా ప్రేమికులకు తెలిపింది. టెన్నిస్ రికార్డుల రారాజు రోజర్ ఫెదరర్ ఒక వైపు… స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరో వైపు… మొత్తమ్మీద ఓ అద్భుతమైన మ్యాచ్ ను వీక్షకులకు అందించారు. మొదటి సెట్ ను ఫెదరర్ 6-4తో ఫెదరర్ కైవసం చేసుకోగా, రెండవ సెట్ ను నాదల్ 6-3తో కొట్టి లెక్కను సరిచేసాడు.
అయితే మరోసారి తనదైన మార్క్ షాట్లతో విరుచుకుపడిన ఫెదరర్ మూడవ సెట్ ను ఏకంగా 6-1తో సొంతం చేసుకుని, మ్యాచ్ లో ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ, నాలుగవ సెట్ వచ్చేసరికి మళ్ళీ రఫెల్ రెచ్చిపోవడంతో ఫెదరర్ వెనుకడుగు వేయక తప్పలేదు. 6-3తో నాలుగవ సెట్ ను నాదల్ కైవసం చేసుకోవడంతో మ్యాచ్ కీలకమైన 5వ సెట్ కు చేరుకుని, క్రీడా అభిమానుల్లో ఉత్కంఠను రేపింది.
చివరి సెట్ ఎవరు కొడితే వారిదే అన్న తరుణంలో… ఫెదరర్ ఫస్ట్ సర్వీస్ నే బ్రేక్ చేసి, సెట్ లో 2-0తో ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత కూడా 3-2తో ముందంజలో ఉండి, ఛాంపియన్ షిప్ దిశగా దూసుకెళ్తున్న రఫెల్ నాదల్ దూకుడుకు బ్రేకులు వేసాడు ఫెదరర్. ఒక పాయింట్ వెనుకబడి, కీలకమైన దశలో మ్యాచ్ ఉన్న తరుణంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి నాదల్ 3 పాయింట్లతో ఉండగానే, ఫెదరర్ 6 పాయింట్లు సాధించి ఛాంపియన్ షిప్ ను సొంతం చేసుకున్నాడు.
అయితే రెండు సార్లు మ్యాచ్ పాయింట్ ను రక్షించుకున్న నాదల్, మూడవసారి మాత్రం ఫెదరర్ ‘హాక్ ఐ’ రివ్యూతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆడిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ళ క్రీడను క్రీడా ప్రేమికులు ఎంతగానో ఎంజాయ్ చేసారు. మ్యాచ్ ఆద్యంతం ఇద్దరు ఆటగాళ్ళు అద్భుతమైన షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను, బుల్లితెర ముందు కూర్చున్న వీక్షకులను ఆకట్టుకున్నారు. ఈ గ్రాండ్ స్లాం టోర్నీతో రోజర్ ఖాతాలో 18వ గ్రాండ్ స్లాం చేరగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సంఖ్య 5కు చేరింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత రోజర్ ఫెదరర్ ఎంతో ఉద్వేగభరితుడయ్యాడు. ముఖ్యంగా నాదల్ ఆటతీరుపై ఎంతగానో ప్రశంసలు కురిపించాడు. నాదల్ చేతిలో ఓడిపోయినా, తానూ సంతోషించేవాడిని, ఇంకా చెప్పాలంటే… టెన్నిస్ లో ఎవరో ఒకరు గెలవక తప్పదు గానీ, ఈ రోజు ‘డ్రా’ అయ్యి, రఫెల్ తో ఈ టోర్నీని పంచుకోవాలని ఉందని చాలా ఏమోషనల్ గా వ్యాఖ్యానించారు ఫెదరర్. ‘నువ్వు టెన్నిస్ ఆడుతూనే ఉండాలి, టెన్నిస్ ఆటకు నువ్వు కావాలి’ అంటూ నాదల్ ను ఈ సందర్భంగా కోరాడు రికార్డుల రారాజు ఫెదరర్.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



