2023 వరల్డ్ కప్ ముగిసి ఇప్పటికే సుమారు 2 ఏళ్ళు కావస్తున్నప్పటికీ, భారత అభిమానులు గాని క్రికెటర్లు గాని ఇంకా ఆ వరల్డ్ కప్ ను మరువలేకపోతున్నారు. ఇవాళ్టి రోజుకి కూడా నవంబర్ 19 అనే తారీకు గుర్తుకువస్తే దిగులు పడని భారత అభిమాని ఉండడని చెప్తే అది అతిశయోక్తి కాదేమో.
ఈ నిరాశకు ముఖ్యమైన కారణం రో-కో జోడి మరొక వరల్డ్ కప్ ఆడతారో ఆడారో అని అనిశ్చితి కారణం. ఇప్పటికే టి-20 మరియు టెస్ట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించగా, ప్రస్తుత వాతావరణం చూస్తుంటే వన్-డే రిటైర్మెంట్ కు కూడా పెద్ద సమయమేమి పట్టదనిపిస్తుంది.
ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశలు, ప్రశ్నలు లేచిన వేళ, విరాట్ మరియు రోహిత్ లు ఆస్ట్రేలియా వన్-డే టూర్ కోసం ఆస్ట్రేలియా వచ్చారు. తమ ఆట పై వేలెత్తి ప్రశ్నించినవారందరికి, వారి ఆట తోనే బదులిస్తారు అని ఫాన్స్ గట్టిగా కోరుకున్నారు. అయితే, అంచనాలు కొండంత ఉంటె తొలి వన్-డే లో ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ దారుణంగా విఫలమయ్యారు.
ఆటలో గెలుపోటములు సహజం అన్న విషయం అందరికి తెలిసినప్పటికీ, తమ కెరీర్ ముందుకు సాగాలంటే తప్పనిసరిగా ఉత్తమ ఆటతీరు తో బరిలోకి దిగాల్సిన ఈ సిరీస్ లో అత్యంత దారుణమైన విధంగా సిరీస్ ను ఆరంభించారు రో-కో లు.
సీనియర్ ప్లేయర్స్ యే ప్రజర్ హ్యాండిల్ చెయ్యలేక ఇలా చేతులెత్తేస్తే ఇక సిరీస్ గెలుపు సంగతి ఎలా.? సిరీస్ మొత్తంలో ఈ విరాట్ – రోహిత్ మూడు సెంచురీలు బాదినా వీరు రాబోయే వరల్డ్ కప్ ఫైనల్ టీం లో చోటు దక్కించుకుంటారు అనే గ్యారెంటీ లేదు అంటూ చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పేర్కొన్నారు.
అటువంటి కృషియల్ పరిస్థితులలో ఈ సీనియర్ ఆటగాళ్లు ఇలా పేలవమైన ఆటతీరు కనపరచడంతో వీరి వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన కెప్టెన్సీ లో టీం ఇండియా కి వరల్డ్ కప్ అందిచాలని అనే రోహిత్ ఆశలకు ఇప్పటికె కొంతమేర గండి పడింది.
రోహిత్ నుంచి జట్టు పగ్గాలు గిల్ చేతులోకి వెళ్లిపోయాయి. తద్వారా తన కెప్టెన్సీలో వరల్డ్ కప్ సాధన అనే కల రోహిత్ కి ఇక కలగానే మిగిలిపోయింది. కనీసం ఆటగాడిగానైనా వరల్డ్ కప్ అందుకోవాలంటే ఈ సిరీస్ రోహిత్ కు చాలా ముఖ్యం.
ఆటగాడిగా ఇప్పటికే విరాట్ కు ఒక వరల్డ్ కప్ ఉన్నప్పటికీ, రోహిత్-విరాట్ జోడి లో ఒక వరల్డ్ కప్ అందుకోవాలని అభిమానుల కల నెరవేరాలంటే విరాట్ కు సైతం ఈ సిరీస్ చాలా ముఖ్యంగా మారుతుంది. చూడాలి మరి, రో-కో లు అభిమానులు ఆశించిన స్థాయిలో ప్రదర్శించి జట్టు యాజమాన్యానికి తమ విలువేంటో మరలా నిరూపించుకుంటారనని..?




