గాడ్స్ ప్లాన్ బేబీ..!

Rohit Sharma No.1 Batsman

ఇటీవలే ముగిసిన భారత్-ఆసీస్ వన్-డే పోరు లో భారత్ 2-1 తో సిరీస్ ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. కానీ, ఈ సిరీస్ ఓటమిని మరిచిపోయేలా చేసింది మాత్రం 3వ వన్-డే లో రో-కో ల బ్యాటింగ్ అనే చెప్పాలి.

సిరీస్ ముగిసేనాటికి సిరీస్ ను గెలవలేకపోయామే అనే బాధ నుంచి కాస్త ఉపశమనం దక్కింది అంటే అది ఆ ఇద్దరి పార్టనర్-షిప్ ఇచ్చిన రిలీఫ్ అనే చెప్పాలి.

ADVERTISEMENT

ఇటు చూస్కుంటే రోహిత్ శర్మ ఈ సిరీస్ లో ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ తో చెలరేగి మ్యాన్ అఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అలాగే, మ్యాచ్ ముగిసిన 4 రోజులకు ఐసీసీ తమ బెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్ ను ఇవాళ ఉదయం విడుదల చేసింది. అందరు ఊహించినట్టే 38 ఏళ్ళ వయసులో రోహిత్ శర్మ నెంబర్-1 వన్-డే బ్యాటర్ గా అవతారమెత్తాడు.

రోహిత్ శర్మ టెస్ట్ మరియు టి-20 లో ఎటువంటి ప్రదర్శన ఇచ్చినా, వన్-డేల్లో రోహిత్ శర్మ ఒక విధ్వంసం అని చెప్పచు. ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యమవ్వని రీతిలో ఏకంగా 3 డబుల్ సెంచరీలు బాదడమేకాక, క్రికెట్ చరిత్రలోనే ఒకే వన్-డే ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ అయిన ‘264’ రికార్డ్ సైతం హిట్-మ్యాన్ పేరిట ఉంది.

వన్-డే ఇంటర్నేషన్ లలో తన పేరిట 33 శతకాలున్నాయి. రోహిత్ శర్మ ఓపెనర్ గా ప్రోమోట్ అయిన వేళ నుండి వన్-డే లలో శివ తాండవం చేస్తున్నాడు. మరి వన్-డే ల్లో ఇంత భీకరమైన ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మ ఒక్కసారి కూడా నెంబర్-1 బ్యాటర్ గా నిలవలేదా అంటే.. లేదు అనే చెప్పాలి. పలుసార్లు నెంబర్-2 వరుకు వెళ్లినా, టాప్ స్పాట్ కు మాత్రం చేరుకోలేకపోయారు.

2019 ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్-కప్ లో ఏకంగా 5 సెంచరీలు కొట్టి, ఎవ్వరు కలలో కూడా ఊహించని రికార్డు ను తన పేరిట లిఖించుకున్నాడు రోహిత్. ఆ టోర్నీ లో 648 పరుగులు చేసి క్రికెట్ గాడ్ సచిన్ రికార్డుకు ఎసరు పెట్టాడు. మరి 2023 లో సొంత గ్రౌండ్లలో ఆడిన వరల్డ్-కప్ లో కెప్టెన్ గా జట్టును నడిపించటమే కాకుండా, బ్యాటర్ గా జట్టుకు శుభారంభాలు ఇస్తూ ప్రతి మ్యాచ్లోనూ ఆకర్షించాడు.

అయితే మరి ఇన్ని సానుకూల పరిస్థితుల్లో కూడా రోహిత్ నెంబర్-1 వన్-డే బ్యాటర్ గా నిలవలేదు. మరి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత వన్-డే జట్టులో కూడా తన చోటు ప్రశ్నార్ధకం అయిన వేళ, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో, అది కూడా ఆస్ట్రేలియా గడ్డ పై ఆడిన సిరీస్ లో ‘మ్యాన్ అఫ్ ది సిరీస్’ అవార్డును అందుకుని,

అటు పిమ్మటే నెంబర్-1 బ్యాటర్ గా నిలవటం, హిట్ మాన్ అభిమానులకే కాదు సగటు భారత క్రికెట్ అభిమానికి సైతం ఆనందాన్ని అందిస్తుంది. కోహ్లీ డైలాగ్ అయినా ‘గాడ్స్ ప్లాన్ బేబీ’ అంటూ సోషల్ మీడియా వేదిక తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు రోహిత్ అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories