చంద్రబాబు ఎదురుగా లేకపోతే రోజాకు ఊపు రాదట

YSR-Congress-Roja---Nagariపద్నాలుగు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో 19 బిల్లులకు ఆమోదం లభించింది. 20 బిల్లులపై సభ చర్చ జరిపింది అలాగే ఒక బిల్లుని ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. ఈ రోజు సభ తరువాత ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ లాబీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఇటీవలే ప్రజాపద్దుల కమిటి చైర్మన్ గా నియమింపబడిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

రోజా ప్రసంగంలో వేడి తగ్గిపోయిందంటూ పయ్యావుల కేశవ్ అంటే.. ‘చంద్రబాబు సభలో లేకపోవడం వల్లే గట్టిగా తిట్టలేకపోయాను. చంద్రబాబును చూస్తే ఆటోమేటిక్‌గా స్పీచ్ ఫ్లో పెరుగుతుంది.’ అంటూ ఆమె సమాధానమిచ్చారు. దీనికి ప్రతి స్పందించిన పయ్యావుల.. రోజా మౌనం వెనుక కారణం అది కాకపోవచ్చన్నారు. జగన్ కేబినెట్ లో చోటు దక్కకపోవడం గురించి పయ్యావుల ఇండైరెక్టుగా ప్రస్తావించారు. చంద్రబాబు ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

అది విన్న రోజా.. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ.. చంద్రబాబు అసెంబ్లీలో లేని సమయం చూసి సీఎం జగన్‌ను పయ్యావుల పొగిడారని వ్యాఖ్యానించారు. తాము తేవాలనుకున్న ‘ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్’ బిల్లు తెచ్చారు కాబట్టే ప్రశంసించానని పయ్యావుల చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ‘ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్’ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో ఆ బిల్లు చాలా మంచిదని, దాన్ని సరైన పద్ధతిలో అమలు చేయాలని పయ్యావుల కేశవ్ సూచించారు. ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నట్లు పయ్యావుల ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories