ఈ AI కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? అస్సలు తెలియడం లేదు. అందుకు తాజా ఉదాహరణ రుక్మిణి వసంత్ బికినీ ఫోటోషూట్ వీడియో. ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియా మొత్తం ఆమె బికినీ ఫోటోలు మరియు వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
నీకి రంగు టూ పీస్ బికినీలో ఉన్న రుక్మిణి వసంత్ కంటెంట్ ను చూసి నోరెళ్లబెట్టని వాళ్ళు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే సదరు కంటెంట్ నిజమా? లేక వేరే ఎవరైనా అమ్మాయి ఫోటోషూట్ కంటెంట్ ను మార్ఫ్ చేసి రుక్మిణి వసంత్ ఫేస్ పెట్టారా? అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే.. ఎవరు ఎంత జూమ్ చేసినా కూడా అవి ఫేక్ అనే భావన మాత్రం కలగడం లేదు.
ఇప్పుడు రుక్మిణి వసంత్ స్వయంగా రెస్పాండ్ అయ్యి.. అవి నిజమో లేక AI తో సృష్టించినవో అనో క్లారిటీ ఇస్తే తప్ప ఈ కన్ఫ్యూజన్ కి తెరపడదు. అయితే.. ఇలా ప్రతిసారి హీరోయిన్లు AI ఫోటోలు/వీడియోల విషయంలో స్పందించాలి అంటే.. గంటకోసారి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. గతంలో శ్రీలీల విషయంలో ఇలానే జరిగితే.. పాపం కంగారుపడి ఆమె రెస్పాండ్ అయ్యింది, తర్వాత అలాంటి ఫోటోలు కోకొల్లలుగా సోషల్ మీడియా మొత్తం పాకిపోవడంతో లైట్ తీసుకుంది. మరి ఇప్పుడు రుక్మిణి రెస్పాండ్ అవుతుందా? లేక లైట్ తీసుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
My team and I have come across certain AI-generated images being circulated online claiming to be me.
I want to state clearly that these images are entirely fake and fabricated.
The creation and circulation of such manipulated content is deeply irresponsible and a serious… pic.twitter.com/8iitXTvFvT
— rukmini (@rukminitweets) May 23, 2026





