“ఫిదా” సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన సాయిపల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆమె డేట్స్ ఇస్తే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సైతం క్యూలు కట్టే నిర్మాతలు ఉన్నారు. ఆ మాటకొస్తే… పలువురు యువ హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా పెట్టుకుని, తమ ఖాతాలో కూడా ఓ హిట్ ను వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే తన వద్దకు వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకునే దిశగా సాయిపల్లవి అడుగులు పడడం లేదు. ప్రస్తుతం నాని, నాగశౌర్యలతో కలిసి సినిమాలు చేస్తున్న సాయిపల్లవి, ఈ రెండు సినిమాలలో ఓ పాత్రలో మాత్రం దెయ్యం క్యారెక్టర్ లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించబోతుందని టాక్. ఇదిలా ఉంటే, ‘ఫిదా’ విడుదలై ఫలితం చవిచూసిన తర్వాత ఓ స్టార్ హీరో సినిమా నుంచి సాయిపల్లవికి నేరుగా ఆఫర్ వచ్చిందట.
సాధారణంగా స్టార్ హీరోల జోడీగా చేసే ఛాన్స్ వస్తే, కధతో నిమిత్తం లేకుండా చేయడానికి హీరోయిన్లంతా రెడీగా ఉంటారు. కానీ సాయిపల్లవి మాత్రం అందుకు మినహాయింపు అనే చెప్పాలి. అవును… సదరు స్టార్ హీరో సినిమాను రిజక్ట్ చేసిందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? తిరస్కరించడానికి సాయిపల్లవి చెప్పిన కారణం ఏమిటి? అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.


