జెస్సీ… కార్తీక్… మళ్లీ రాబోతున్నారట..!

naga chaitanya samantha wedding in Goaనాగచైతన్య… సమంత కలిసి ‘ఏమాయ చేశావే’ .. ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలు చేశారు. ఈ రెండింటిలో ‘ఏ మాయ చేశావే’ ఘన విజయాన్ని సాధించగా, ఈ జంట వివాహం చేసుకుని అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందనే భావన నెలకొంది.

ADVERTISEMENT

చైతూతో ‘శైలజా రెడ్డి అల్లుడు’ చేస్తోన్న మారుతి, హీరోయిన్ పాత్రను సమంతతో చేయించాలని గట్టి ప్రయత్నమే చేశాడు గానీ కుదరలేదు. త్వరలోనే ఈ జంట మళ్లీ తెరపై కనిపించనుందనేది అభిమానులకు శుభవార్త లాంటిదే. రచయిత కోన వెంకట్ ఓ నిర్మాతగా మారి డీవీవీ దానయ్యతో కలిసి ‘నిన్నుకోరి’ సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయింది.

దీంతో ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణతోను, డీవీవీ దానయ్యతోను కలిసి మరో సినిమాను నిర్మించడానికి కోన వెంకట్ రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూను కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. కథ, తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో చేయడానికి సమంత కూడా అంగీకరించిందని అంటున్నారు. ప్రస్తుతం చైతూ చేస్తోన్న రెండు సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.

ADVERTISEMENT
Latest Stories