‘జై లవకుశ’పై లేటెస్ట్ రూమర్!

Rumours on Jai Lava Kusa Climaxఈ నెల 21వ తేదీన విడుదల కాబోతున్న ఎన్టీఆర్ – బాబీల “జై లవకుశ” సినిమాపై ఇప్పటివరకు చాలా పుకార్లు హల్చల్ చేసాయి. అందులో భాగంగానే తాజాగా మరో రూమర్ కూడా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఉన్న ఎన్టీఆర్ మూడు పాత్రలలో ‘జై’ పాత్ర ‘రావణాసురుడు’ విలనిజాన్ని ప్రదర్శించనున్న విషయం తెలిసిందే. అయితే అది ఏ టైపు విలనిజం అనేది మాత్రం సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలి. మంచిలో చెడా… చెడులో మంచా… అన్నది పక్కన పెడితే… విలనిజం అయితే కామన్..!

ADVERTISEMENT

అయితే సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి ‘జై’ విలనిజాన్ని ‘లవకుశ’లు కలిసి అంతం చేసే విధంగా అనుకున్నారట. ఈ రెండు పాత్రలు కలిసి మూడో పాత్రను అంతం చేసే విధంగా అనుకున్నప్పటికీ, ఆ తర్వాత ఈ క్లైమాక్స్ ను మార్చినట్లుగా ఓ పుకారు షికారు చేస్తోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. మరి ‘జై లవకుశ’ సినిమాకే హైలైట్ అయిన ‘జై’ పాత్రను చంపేస్తే ప్రేక్షకులు ఎంతవరకు తీసుకుంటారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories