పుకార్లను నమ్మవద్దన్న ‘గాన గాంధర్వుడు’

S. P. Balasubrahmanyam condemns the rumours of critical healthఇటీవల కాలంలో సెలబ్రిటీల ఆరోగ్యాలపై వదంతులను విపరీతంగా సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వేణుమాధవ్ వంటి కొందరి విషయాలలో అయితే ఏకంగా బ్రతికున్న వ్యక్తినే చంపేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై కూడా వదంతులు రావడంతో, స్వయంగా ఎస్పీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేసారు ఎస్పీ.

ADVERTISEMENT

సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన శ్రేయోభిలాషుల నుంచి తనకు పరామర్శలు వస్తున్నాయని, ఆరోగ్యం బాగుండని కారణంగా ప్రదర్శనలు రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోందని తన శ్రేయోభిలాషులు చెప్పారని అన్నారు. దగ్గు, జలుబు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే తన ఆరోగ్యం బాగుండలేదని అనుకుని ఉంటారని అన్నారు.

తన ప్రదర్శనల రద్దుకు కారణం.. తన సోదరి గిరిజ కన్నుమూయడమేనని, దాదాపు 12 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సంఘటన తర్వాత సెప్టెంబరు 2న బెంగళూరులో ప్రదర్శన ఇచ్చానని, ప్రస్తుతం ‘స్వరాభిషేకం’ షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్టు చెప్పారు. తన ఆరోగ్యంపై వదంతులు సృష్టించి, ఎందుకు బాధ కల్గిస్తారో అర్థం కావడం లేదని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని తన అభిమానులను, శ్రేయోభిలాషులను కోరారు.

ADVERTISEMENT
Latest Stories