టీవీ నటి కేసులో కీలకంగా మారిన ‘నగ్న దేహం?’

sabarna-suicide-case-police-enquiryతమిళ బుల్లి, వెండితెర టీవీ నటి నటి సపర్ణ మరణం పోలీసులకు మిస్టరీగా మారింది. తొలుత ఆత్యహత్యగా భావించిన ఈ కేసులో తాజాగా అనేక అనుమానాస్పదమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా నటి సపర్ణ రాసుకున్న డైరీలో ప్రేమ వ్యవహారం బయట పడడంతో పాటు, ఆ ప్రేమ విఫలమైన విషయమూ ఉండడంతో సపర్ణ ప్రియుడ్ని పిలిపించి విచారణ చేసేందుకు పోలీసులు సమాయాత్తమవుతున్నారు. అలాగే ఈ కేసులో సపర్ణ శరీరం నగ్నంగా ఉండడంతో ఆత్మహత్య కంటే కూడా హత్య అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఎవరైనా ఆత్యహత్య చేసుకోవాలనుకుంటే, తమకు తాముగా వివస్త్రగా మారరని, అందులోనూ సపర్ణ శరీరంపై పంటి గాట్లు ఉండడం తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకున్న పోలీసులు ఈ కేసును వీలైనంత త్వరగా చేధిస్తామని ప్రకటించారు. అలాగే సపర్ణ గదిలో సిగరెట్ ముక్కలు ఉండడం పోలీసుల అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. డైరీలో సపర్ణ రాసుకున్న విషయాలు కేసులో కీలకంగా కాబోతున్నాయని సమాచారం. అలాగే సపర్ణ మొబైల్ ఫోన్ నుండి గత మూడు రోజులుగా ఎవరెవరితో మాట్లాడారో అన్న సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు.

ADVERTISEMENT

ఏది ఏమైనా సినీ, టీవీ రంగంలో ఇటీవల కాలంలో నమోదవుతున్న యాంకర్లు, హీరోయిన్ల ఉదంతాలతో ‘రంగుల ప్రపంచం’ అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక సంఘటన మరిచిపోక ముందే మరొకటి వెలుగులోకి వస్తూ, ఎప్పటికప్పుడు పరిశ్రమ తీరును ఏకరువు పెడుతోంది. ఈ సంఘటనకు ముందు జరిగిన బాలీవుడ్ ‘చిన్నారి పెళ్లికూతురు’ ప్రత్యూష బెనర్జీ కేసుపై ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదన్న విషయం తెలిసిందే. దీంతో సపర్ణ మిస్టరీ ఎప్పటికీ విడుతుందో..?!

ADVERTISEMENT
Latest Stories