సెప్టెంబర్ 9… సెంచరీలకు శ్రీకారం..!

Next Grand Premier Sachin A Billion Dreams on the Way to Rockస‌చిన్ టెండూల్క‌ర్‌ కు, ఆయ‌న‌ను అభిమానించే కోట్లాది మందికి మ‌ర‌చిపోలేని రోజు సెప్టెంబర్ 9. ఎందుకంటే క్రికెట్‌ లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన స‌చిన్ టెండూల్క‌ర్ సెప్టెంబ‌ర్ 9, 1994లో వ‌న్డేల్లో త‌న మొట్ట‌మొద‌టి సెంచ‌రీ సాధించాడు. స‌చిన్ త‌న కెరీర్‌లో వ‌న్డేల్లో మొత్తం 49 సెంచ‌రీలు సాధించిన విష‌యం తెలిసిందే. ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాలంటే మరికొద్ది సంవత్సరాలలో విరాట్ కోహ్లి వల్ల మాత్రమే అయ్యే పనిలా కనపడుతోంది. స‌చిన్ టెండూల్క‌ర్ అంత‌ర్జాతీయ‌ క్రికెట్లోకి అడుగుపెట్టి త‌న తొలి వ‌న్డే మ్యాచ్‌ను 1989లో ఆడాడు.

అయితే వ‌న్డేల్లోకి ప్ర‌వేశించిన ఐదు సంవత్స‌రాల వ‌ర‌కు క‌నీసం ఒక్క సెంచ‌రీ కూడా న‌మోదు చేసుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 1989 నుంచి 1993 మ‌ధ్య మొత్తం 77 వ‌న్డే మ్యాచులు ఆడిన స‌చిన్… ఒక్క సెంచ‌రీ కూడా కొట్ట‌న‌ప్ప‌టికీ ఆ త‌రువాతి సంవ‌త్స‌రం నుంచి సెంచ‌రీల మీద సెంచ‌రీలు బాదుకుంటూ వ‌చ్చాడు. 1994లో న్యూజిలాండ్‌తో భార‌త్‌కు జ‌రిగిన మ్యాచ్‌ లో మొద‌టి సారి ఓపెన‌ర్‌గా దిగిన స‌చిన్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు కానీ, సెంచ‌రీ చేయ‌లేక‌పోయాడు. అనంత‌రం అదే సంవ‌త్స‌రం ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో 130 బంతుల్లో 110 ప‌రుగులు చేశాడు.

ADVERTISEMENT

స‌చిన్ ఆ ఏడాది సెప్టెంబ‌ర్ 9న త‌న మొద‌టి సెంచ‌రీ చేసిన సంద‌ర్భంగా ఈ రోజు ఐసీసీ సైతం త‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ ఖాతాలో ఆ రోజు గుర్తు చేసుకుంది. స‌చిన్ త‌న 78వ వ‌న్డే మ్యాచ్‌లో తొలి సెంచ‌రీ చేశాడ‌ని గుర్తు చేసింది. ఆ మ్యాచ్‌ లో స‌చిన్ రెండు సిక్సులు, ఎనిమిది ఫోర్లు బాదాడు. స‌చిన్ కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆ నాటి తీపి జ్ఞాప‌కాన్ని గుర్తు చేసుకుంటూ.. స‌మ‌యం వెళ్లిపోతున్నా మెమొరీలు మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండి పోతాయ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ తీపి గుర్తును పోస్ట్ చేసినందుకు గానూ ఐసీసీకి థ్యాంక్స్ చెప్పాడు.

ADVERTISEMENT
Latest Stories