నాన్నకు ఉన్నంత సీన్ నాకు లేదని తెలుసు – చైతూ!

Sahasam Swasaga Sagipo Naga Chaitanya Movie Promotion Stills గతేడాది డిసెంబర్ లో విడుదల కావాల్సిన “సాహసం శ్వాసగా సాగిపో” సినిమా, ఎట్టకేలకు ఈ నవంబర్ 11వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరో నాగచైతన్య పాల్గొంటూ చిత్ర విశేషాలను చెప్తున్నాడు. ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే… ఫస్టాఫ్ ‘ఏ మాయ చేసావే’ సినిమా మాదిరి ఉంటుందని, సెకండాఫ్ ‘ఘర్షణ’ సినిమా తరహాలో ఉంటుందని అన్నాడు.

ప్రేమమ్ సినిమా కంటే ముందు విడుదల కావాల్సిన ఈ సినిమా లేటుగా రిలీజ్ అవుతున్నా… సినిమాపై పూర్తి నమ్మకం ఉందని, దర్శకుడు గౌతమ్ మీనన్ తీర్చిదిద్దిన తీరు బాగుందని అన్నారు. ఇక, తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ… ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా ఉంటుందని, అలాగే జెంటిల్మెన్ కధా రచయిత డేవిడ్ నాథన్ అందించిన కధతో మరో సినిమా చేస్తున్నానని ఖరారు చేసాడు.

ADVERTISEMENT

ముందుగా ‘హలో బ్రదర్’ సినిమాను రీమేక్ చేద్దామని భావించినప్పటికీ, ఆ రేంజ్ లో నేను నటించలేనన్న విషయం తెలుసు కాబట్టి, ఆ ప్రతిపాదనలను వదులుకున్నామని, టాలీవుడ్ క్లాసిక్ చిత్రాలలో ఒకటైన ‘హలో బ్రదర్’ను పాడు చేయట్లేదని సూటిగా ఒప్పేసుకున్నాడు. నిజానికి చైతూ చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్. “హలో బ్రదర్” అనే సినిమా నాగ్ కెరీర్ లో వన్నాఫ్ ది బెస్ట్. అందులోనూ బుల్లితెరపై ఎన్ని సార్లు వేసినా బోరు కొట్టకుండా ప్రేక్షకులు వీక్షిస్తుంటారు. అలాంటి సినిమాను రీమేక్ చేయడమంటే… కొరివితో తల గోక్కున్నట్టే… కదా..!

ADVERTISEMENT
Latest Stories