‘బాహుబలి’ సెంటిమెంట్ తో ‘సాహో’

Sahoo special video on prabhas birthdayరాజమౌళి దర్శకత్వంలో ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా నటించిన “బాహుబలి” సినిమా సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రెండు పార్టులు కలిపి 2000 కోట్లు పైనే వసూలు చేసిన ఈ సినిమాకు సంబంధించిన మొదటి వీడియోను ఎప్పుడు విడుదల చేసిన తేదీని ప్రభాస్ అభిమానులు మరిచిపోలేదని చెప్పడంలో సందేహం లేదు. అవును… ‘యంగ్ రెబల్ స్టార్’ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన “బాహుబలి” సినిమా చిత్రీకరణకు సంబంధించి మొదటి వీడియో విడుదలైంది. ఆ మిగిలినదంతా ఓ చరిత్ర!

ADVERTISEMENT

ఇప్పుడు అదే బాటలో “సాహో” సినిమా పయనించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన విడుదల చేయనున్నట్లుగా ట్రేడ్ వర్గాల టాక్. ‘బాహుబలి’ మాదిరే ఇది కూడా షూటింగ్ కు సంబంధించి ఉంటుందని, అలాగే చివర్లో ప్రభాస్ లుక్ ను చూపిస్తారనేది ఇన్ సైడ్ న్యూస్. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories