‘మహేష్’ రిసీవ్ చేసుకున్న విధానానికే ‘ఫిదా’

sai dharam tej about mahesh babu hospitalityమెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన “విన్నర్” సినిమా మొదటి పాటను ప్రిన్స్ మహేష్ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాటను సమంత రిలీజ్ చేయగా, తాజాగా మాస్ మహారాజా రవితేజ మరో పాటను విడుదల చేయబోతున్నారు. అయితే మొదటి పాటను రిలీజ్ చేయాల్సిందిగా మహేష్ ను కోరడానికి వెళ్ళినపుడు, వచ్చిన స్పందనను చూసి ఫిదా అయ్యాను అంటున్నాడు మెగా హీరో సాయి.

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ ఏమోషనల్ సీన్ చేస్తున్న సందర్భంలో… షూటింగ్ స్పాట్ కు తానూ వచ్చానన్న విషయం తెలుసుకున్న మహేష్, షూటింగ్ కాసేపు బ్రేక్ ఇచ్చి వెంటనే తన వద్దకు వచ్చి పలకరించగా, ‘విన్నర్ సినిమాలో మొదటి పాటను విడుదల చేయాల్సిందిగా తానూ కోరానని’ తేజ చెప్పుకొచ్చారు. తప్పనిసరిగా విడుదల చేస్తానని, తనను ట్రీట్ చేసిన విధానానికి ఆశ్చర్యపోయానని మహేష్ తీరును ప్రశంసలతో ముంచెత్తారు ఈ మెగాహీరో.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories